డాకు మహారాజ్ మూవీకి సీక్వెల్ కాదు ప్రీక్వెల్.. నిర్మాత నాగవంశీ క్రేజీ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ( Balakrishna ) హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్.

( Daaku Maharaaj ) ఈ సినిమాలో ఊర్వశి, శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, చాందిని చౌదరి వంటి హీరోయిన్లు కీలకపాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.

బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్‌, రోనిత్ రాయ్ నెగెటివ్‌ షేడ్స్‌లో నటించిన ఈ చిత్రం తాజాగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌ గా విడుదలైంది.సంక్రాంతి కానుకగా ఫ్యామిలీతో పాటు మాస్‌ ప్రేక్షకులను మెప్పిస్తూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.

అయితే తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్గా స్పందన లభించింది.ఈ సినిమా విడుదల అయ్యి హిట్ టాక్ ని తెచ్చుకుంది.

సినిమాకు రివ్యూలు కూడా పాజిటివ్ గానే వచ్చాయి.ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు బాలకృష్ణ టీం బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ ప్రెస్ మీట్ లో భాగంగా ఒక రిపోర్టర్ నిర్మాత సూర్యదేవర నాగ వంశీని( Producer Suryadevara Naga Vamsi ) ప్రశ్నిస్తూ.

Advertisement

ఈ సినిమాకు ప్రీక్వెల్ ఏమైనా ఉండబోతోందా అని అడిగారు.ఈ విషయమై నాగవంశీ మాట్లాడుతూ.ప్రీక్వెల్‌ ను ప్లాన్ చేస్తున్నామన్నాడు నాగవంశీ.

సినిమాలో ఒక విగ్రహం తల లేకుండా కనిపిస్తుంది.ఇదే పాయింట్‌ ను హీరోగా చేసి డాకు మహారాజ్‌ ప్రీక్వెల్‌ గా( Daaku Maharaaj Prequel ) సినిమా చేయాలని మేం ప్లాన్ చేస్తున్నామని అన్నారు.

ఇప్పుడీ కామెంట్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి.దాంతో ఈ మూవీ ప్రీక్వెల్‌ బాలకృష్ణతోనే ఉండబోతుందా? లేదంటే వేరే యాక్టర్‌ ఎవరైనా కనిపిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.కాగా చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే.

ఇకపోతే తాజాగా విడుదలైన డాకు మహారాజ్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.దానికి తోడు ప్రస్తుతం సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని మూవీ మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు