చైతూ చేతుల మీదగా 'అనుభవించు రాజా' టైటిల్ సాంగ్!

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అనుభవించు రాజా.ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ విడుదల అయ్యి మంచి అంచనాలే నెలకొన్నాయి.

ఫస్ట్ లుక్ ను నాగార్జున విడుదల చేయగా.టీజర్ ను రామ్ చరణ్ విడుదల చేసారు.

టీజర్ తోనే ఈ సినిమాపై మంచి అంచనాలు రావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది.విడుదల అయినా టీజర్ మొత్తం గ్రామీణ వాతావరణంలో కోడి పందేలు, పేకాట, డాన్స్ లు వంటి వాటికీ అలవాటు పడ్డ జల్సా రాయుడు ఎలా ఉంటాడు అనే నేపథ్యంలో చూపించారు.

ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి మొదటి పాట ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

Advertisement

ఈ సినిమా లోని ఫస్ట్ పాటను నాగ చైతన్య చేతుల మీదుగా విడుదల అయ్యింది.ఈ సాంగ్ చాలా హుషారుగా రాజ్ తరుణ్ క్యారెక్టర్ మొత్తం తెలిసేలా ఉంది.ఈ సినిమాలో రాజ్ తరుణ్ క్యారెక్టర్ టీజర్ చూస్తేనే అర్ధం అయ్యింది.

ఇందులో రాజ్ తరుణ్ ను విలాసాలకు అలవాటు పడిన జూదగాడిగా నటిస్తున్నాడు.ఈ పాటకు భాస్కర్ భట్ల సాహిత్యం అందించగా.

గోపి సుందర్ ట్యూన్ అందించారు.

ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడీగా కాశిష్ ఖాన్ నటిస్తుంది.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్పీ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాను నిర్మస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించ బోతున్నారు.అందుకే చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తూ ఈ సినిమాను ప్రజలకు చేరువ చేస్తుంది.

Advertisement
https://youtu.be/19me5pGFHLs

తాజా వార్తలు