Mudragada Padmanabham ; ఈ నెల 12న వైసీపీలోకి ముద్రగడ..!?

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు ఆయన ఈ నెల 12వ తేదీన వైసీపీ( YCP ) కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం.

కాగా ముద్రగడ నివాసానికి వైసీపీ నేత గణేశ్ వచ్చారు.ఈక్రమంలోనే ముద్రగడడను ఎంపీ మిథున్ రెడ్డితో ( MP Mithun Reddy )జక్కంపూడి ఫోన్ లో మాట్లాడించారని తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకున్నా పార్టీలో చేరికకు ముద్రగడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.దీంతో ముద్రగడను మిథున్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ నేపథ్యంలో ముద్రగడ చేరిక ఖాయమంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

Advertisement
తండేల్ సినిమాతో నాగ చైతన్య పాన్ ఐడియా హీరోగా ఏడుగుతాడా..?

తాజా వార్తలు