ఈ మధ్య కాలంలో బుల్లితెరను ఒక దుమ్ము దులిపిన సినిమాలు ఏంటో తెలుసా ?

ఒకప్పుడు ఒక సినిమా విడుదలైన తరువాత ఆ సినిమా ఎన్ని కలెక్షన్స్ రాబట్టింది.ఎన్ని రోజుల వరకు థియేటర్లలో సక్సెస్ఫుల్గా ఆడింది అన్నది చూసే వారు.

కానీ ఇప్పుడు మాత్రం సినిమా రికార్డులలో ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు.థియేటర్ లో విడుదలైన తర్వాత కలెక్షన్స్ గురించి.

ఇక ఓటిటి లో వ్యూస్ గురించి రికార్డుల చూస్తున్నారు.అటు ఇటు టీవీలో ప్రసారమైన తర్వాత రేటింగ్ ఎంత వచ్చింది అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు అని చెప్పాలి.

ఇటీవలికాలంలో టెలివిజన్ లో ప్రసారమైన సినిమాలలో రేటింగ్ తో రికార్డు సృష్టించిన సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్ సినిమా థియేటర్లో విడుదలై ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఆ తర్వాత ఓ టి టి లో రిలీజ్ అయిన అదే రేంజ్ లో బజ్ ఏర్పడింది.

Advertisement

కానీ ఎందుకో టీవీ పై మాత్రం అంచనాలు అందుకోలేక పోయింది భీమ్లా నాయక్.డీజే టిల్లు కంటే తక్కువ టిఆర్పి రేటింగ్ నమోదు చేయడం గమనార్హం.

భీమ్లా నాయక్ నాన్ థియేట్రికల్ హక్కుల్లో భాగంగా శాటిలైట్ ను స్టార్ మా సొంతం చేసుకోవడం గమనార్హం.ఈ క్రమంలోనే భీమ్లా నాయక్ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందని అందరు అనుకున్నారు.

భీమ్లా నాయక్ టీవీలో ప్రసారమైన సమయంలో టి ఆర్ పి రేటింగ్ 9.06 గా వచ్చింది.అదే సమయంలో డీజే టిల్లు సినిమా కి మాత్రం 10.03 రేటింగ్ రావడం గమనార్హం.అయితే డీజే టిల్లు మొదటిసారి ప్రసారమైన ఇంతటి రేటింగ్ రావడంపై అందరూ ఆశ్చర్యపోయారు అనే చెప్పాలి.

కాగా కొన్ని సినిమాలు అటు థియేటర్లో బోల్తాపడ్డ టీవీల పై మాత్రం టిఆర్పీ లతో రికార్డులు సృష్టిస్తూ ఉంటాయి.కానీ భీమ్లా నాయక్ సినిమా విషయంలో మాత్రం థియేటర్ లో గర్జించిన టీవీ లో మాత్రం టీఆర్పీ సాధించలేకపోయింది అని చెప్పాలి.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

ఈ క్రమంలోనే దీని గురించి ఆసక్తికర చర్చ జరుగుతోందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు