మోడీ లెక్కల ప్రకారం బీజేపీకి 300 సీట్లు గారంటీ అంటా

గత ఎన్నికలలో అత్యధిక స్థానాలలో విజయం సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ ఈ ఐదేళ్ళలో ఎంత ప్రజల సహనాన్ని పరీక్షించింది అని చెప్పాలి.

ముఖ్యంగా మోడీ నియంతృత్వ పోకడలతో చేసిన సంస్కరణల కారణంగా ప్రజల అసహనం రెట్టింపు అయిపొయింది అని చెప్పాలి.

అయితే పరిపాలనలో కొంత ప్రగతి కారణంగా మోడీ మీద అభిమానం చూపించే వారు కూడా ఉన్నారు.ఇదిలా ఉంటే తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో మరో సారి మోడీ నేతృత్వంలో బీజేపీ సర్కార్ అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తుంది.

Modi Says Bjjp Will Be Win 300 Seats-మోడీ లెక్కల ప్ర�

అయితే ఈ సారి బీజేపీ గెలుపు అంత వీజీ కాదనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.బీజేపీ పార్టీకి దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది.

ఈ నేపధ్యంలో ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా కాంగ్రెస్ కి దగ్గరై రాహుల్ ని ప్రధాని చేయాలనే ఆలోచనతో ఉన్నారు.అయితే ఈ స్సారి కూడా మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని జాతీయ సర్వేలు చెబుతున్నాయి.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా ఎన్నికల పోలింగ్ తుది దశకి వచ్చేసింది.ఈ నేపధ్యంలో తాజాగా మోడీ మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువగా ఏకంగా మూడు వందల స్థానాలలో విజయం సొంతం చేసుకుంటామని చెప్పుకొచ్చారు.

మరి మూడు వందల సీట్లు ఎలా వస్తాయి అనేది మోడీనే చెప్పాలి అనే కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు