ఆర్ఆర్ఆర్ లో ఆ సాంగ్ చెడగొట్టారు.. కీరవాణి తండ్రి సంచలన వ్యాఖ్యలు?

ఆర్ఆర్ఆర్ మూవీ మన దేశంతో పాటు ఇతర దేశాల్లో సైతం సంచలనాలు సృష్టించిన సినిమాలలో ఒకటి.

మరో వారం రోజుల్లో ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ రావడం గ్యారంటీ అని తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు భావిస్తున్నారు.

నాటు నాటు సాంగ్ లో చరణ్, తారక్ వేసిన స్టెప్పులు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని కామెంట్లు వ్యక్తమయ్యాయి.అయితే కీరవాణి తండ్రి శివశక్తిదత్తా మాత్రం ఆర్ఆర్ఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనకు ఆర్ఆర్ఆర్ మూవీ కంటే బాహుబలి ఇష్టమని ఆయన అన్నారు.బాహుబలి సినిమాలోని మెజారిటీ సాంగ్స్ నేనే రాశానని ఆయన చెప్పుకొచ్చారు.

తెలుగు సినిమాల కోసం సంస్కృతంలో పాటలు రాసే వ్యక్తిని తాను మాత్రమేనని శివశక్తిదత్తా కామెంట్లు చేశారు.ఆర్ఆర్ఆర్ మూవీ క్లైమాక్స్ లో వచ్చే రామం రాఘవం సాంగ్ ను రాసింది నేనేనని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement
Mm Keeravani Father Shivashaktidatta Shocking Comments About Rrr Song Details, M

ఆ పాట ట్యూన్ తనకు నచ్చలేదని ఆయన తెలిపారు.

Mm Keeravani Father Shivashaktidatta Shocking Comments About Rrr Song Details, M

ఆ సాంగ్ కు ఆకట్టుకునే విధంగా ట్యూన్ ఇవ్వలేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సై సినిమాలోని నల్లా నల్లాని కళ్ల పిల్లా సాంగ్ కూడా నాదేనని నేను ఎప్పుడో ఇష్టంతో రాసుకున్న ఆ సాంగ్ ను రాజమౌళి సై సినిమాలో పెట్టారని శివశక్తిదత్తా పేర్కొన్నారు.ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు తమ సినిమాలలో పాటలు రాయాలని నన్ను ఎప్పుడూ సంప్రదించలేదని ఆయన కామెంట్లు చేశారు.

Mm Keeravani Father Shivashaktidatta Shocking Comments About Rrr Song Details, M

తొమ్మిది పదుల వయస్సులో కూడా యాక్టివ్ గా కనిపిస్తున్న శివశక్తిదత్తా మీడియాకు కూడా దూరంగా ఉంటారు.రాజమౌళి సినిమాల ఈవెంట్లలో కూడా ఆయన ఎక్కువగా కనిపించడం లేదు.తమ కుటుంబంలో రాజమౌళికి మాత్రమే హీరో లుక్స్ ఉన్నాయని అయితే రాజమౌళికి యాక్టింగ్ పై ఆసక్తి లేదని ఆయన పేర్కొన్నారు.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు