జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంటర్

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంటర్ ఇచ్చారు.

ఇసుక రీచ్ లకు అనుమతి ఉందో లేదో మైనింగ్ అధికారులను అడగాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి సూచించారు.

కానీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా రీచ్ వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని చెప్పారు.ఇసుక రీచ్ లతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

కేవలం తన రాజకీయ లబ్ధి కోసమే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన చేశారని ఆరోపించారు.ప్రజలు సంతోషంగా ఉండటం జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇష్టం లేదని విమర్శించారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు