టీడీపీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపాటు

టీడీపీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఏపీలో పారిశ్రామిక ప్రగతిపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

అటు విశాఖలోని రుషికొండలో అక్రమ నిర్మాణాలంటూ విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీతో సంబంధం లేని వాళ్లు కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.అమరావతిలో పంట పొలాలు నాశనమైతే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రజలపై చంద్రబాబుకు ప్రేమ లేదని విమర్శించారు.ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పగలరా అని నిలదీశారు.

Advertisement

వైఎస్ఆర్, జగన్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని మంత్రి గుడివాడ వెల్లడించారు.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు