మేడారం స్పెషల్‌ : కుక్కకు నిలువెత్తు బంగారం

తెలంగాణలోనే కాకుండా సౌత్‌ ఇండియాలోనే అతి పెద్ద జాతరగా పేరు దక్కించుకున్న మేడారం సమ్మక సారలమ్మ జాతర మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది.

అధికారికంగా మరికొన్ని గంటలు పట్టబోతుంది.

కాని గత నెల రోజులుగా జాతర సాగుతూనే ఉంది.సమ్మక సారలమ్మ గద్దెల వద్ద క్వింటాల్ల బంగారం(బెల్లం) ను భక్తులు సమర్పిస్తూనే ఉన్నారు.

పిల్లలకు పెద్దలకు మొక్కులు మొక్కుకుంటూ నిలువెత్తు బంగారంను ఇస్తున్నారు.ఏదైనా మొక్కుకుంటే అది నెరవేరితే నిలువెత్తు బంగారం ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది.

నిన్న మేడారంలో ఒక జంట తాము పెంచుకుంటున్న కుక్క తప్పి పోవడంతో ఆ కుక్క దొరకాలని మొక్కుకున్నారట.మొక్కుకున్న ఒక్క రోజులోనే కుక్క దొరికింది.

Advertisement

దాంతో ఇప్పుడు ఆ కుక్కకు నిలువెత్తు బంగారం తూచి సమ్మక సారలమ్మలకు ఇచ్చారు.ఇప్పటి వరకు నిలువెత్తు బంగారం మనుషులకే ఇచ్చారు.

మొదటి సారి ఒక జంతువుకు నిలువెత్తు బంగారం ఇవ్వడం జరిగిందంటూ స్థానికులు చెబుతున్నారు.ఇక జాతర విషయానికి వస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసింది.

ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోయేలా ఏర్పాట్లు చేసింది.

కుక్క ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే.. ఏనుగు ముందు నిలబడి ఏం చేసిందో చూడండి!
Advertisement

తాజా వార్తలు