అమెరికాలో భారీ కుంభకోణం..భారత ఎన్నారైల కీలక పాత్ర

ప్రపంచ దేశాల్లో ఉన్న ఎంతో మంది భారతీయులు భారత జాతి కీరి ప్రతిష్టలని ఇనుమడింప చేస్తూ ఎన్నో ఉన్నతమైన శిఖరాలని అధిరోహిస్తూ ఉంటే భారత ప్రజలు ఇతర దేశాలలో ఉన్న భారత ఎన్నారైలు ఎంతో సంతోషం వ్యక్తం చేసేవారు.

అయితే గత కొంతకాలంగా అమెరికా వంటి అగ్ర రాజ్యంలో భారతీయులు ఆర్ధికంగా రాజకీయంగా ఎదిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇలాంటి సందర్భంలో 5 బీపీవో సెంటర్ల ఏడుగురు భారతీయులు చేసిన కుంభకోణం వలన భారత్ పరువుని తీసేశారు.ఇప్పుడు అమెరికా కోర్టు ముందు దోషులుగా నిలబడ్డారు.

వివరాలలోకి వెళ్తే.ఆర్థిక అవసరాల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని కాల్‌ సెంటర్‌ నిర్వాహకులు పాల్పడిన కుంభకోణంపై అమెరికా ఉక్కుపాదం మోపింది.ఈ కుంభకోణం 2012-16 మధ్య జరిగింది ఇప్పటికే ఈ స్కాంలో సంభందం ఉన్న 21 మంది భారత సంతతి ప్రజలు, ముగ్గురు భారతీయులు 20 ఏళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటుండగా.

ఇప్పుడు తాజాగా మరో 15 మందిపై నేరారోపణ నమోదు చేసింది.వీరిలో ఏడుగురు భారత సంతతి ప్రజలు ఉన్నారు.అంతేకాదు.

Advertisement

5 భారత కాల్‌ సెంటర్లు కూడా ఉన్నాయి.ఈ మొత్తం నిర్వహణ అహ్మదాబాద్‌ కేంద్రంగా నిర్వహిస్తున్నారు.వీటి నిర్వాహకులు ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీసె్‌స(ఐఆర్‌ఎస్‌) లేదా యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసె్‌స (యూఎ్‌ససీఐఎస్‌) అధికారులమంటూ ఫోన్లు చేసి రుణాలు (పేడే లోన్లు) ఇస్తామంటూ ఆఫర్‌ చేశారు.

ఆ తరువాత ప్రభుత్వానికి పన్నులు కాట్టాలని లేకపోతే అరెస్టులు చేస్తామని దాదాపు 55 లక్షల డాలర్ల కుంభకోణానికి పాల్పడ్డారని అమెరికా న్యాయశాఖ పేర్కొంది.వీరిపై త్వరలో ఖటినమైన చర్యలు తీసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు