Kathryn Hahn: ఎంత ఎదిగినా నార్మల్ పర్సన్ లా ఉండడమే ఇష్టం.. స్టార్ నటి కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలో కొందరు సెలబ్రిటీలు ( Celebrites ) కోట్లు సంపాదించినా కూడా ఎక్కువగా హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా జీవితాన్ని లైఫ్ ని లీడ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు.

కోట్లకు కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ చాలా సింపుల్ గా జీవిస్తూ ఉంటారు.

చాలా తక్కువ శాతం మంది మాత్రమే సెలబ్రిటీలు ఈ విధంగా ఉండడానికి ఇష్టపడతారు అని చెప్పవచ్చు.అటువంటి వారిలో మార్వెల్( Marvel ) సినిమాటిక్ యూనివర్స్ స్టార్ కేథ్రిన్ హాన్( Kathryn Hahn ) కూడా ఒకరు.

దాదాపుగా పాతికేళ్ల నుండి సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే.

Marvel Star Kathryn Hahn On Fame I Still Feel Like A Normal Person

మార్వెల్ కామిక్ సిరీస్ తో ఒక్కసారిగా రాత్రికి రాత్రి స్టార్ డమ్ ని సంపాదించుకుంది.అలాగే రెండేళ్ల క్రితం రూపొందిన వాండా విజన్ మినీ సిరీస్ లో కూడా కేథ్రిన్ హాన్ కీలకపాత్రలో నటించింది.ఈ సిరీస్ తర్వాత ఆమె స్టార్ మారిపోయినప్పటికీ ఆమె మాత్రం సాధారణ మహిళ గానే జీవనం సాగిస్తున్నట్లు తెలిపింది.

Advertisement
Marvel Star Kathryn Hahn On Fame I Still Feel Like A Normal Person-Kathryn Hahn

కాగా కేథ్రిన్ హాన్ సహనటుడు అయినా ఎథాన్ సాండ్లర్ ని 2002లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.అప్పట్లో న్యూయార్క్ సిటీలో ఒకే ఒక బెడ్ రూమ్ ఉన్న ఫ్లాట్లో వారి జీవితం ఆరంభించినట్లు ఆమె తెలిపింది.

Marvel Star Kathryn Hahn On Fame I Still Feel Like A Normal Person

ఆ సమయంలో తాను ఒకచోట తన భర్త ఒకచోట రిసెప్షనిస్ట్ గా పనిచేసినట్లు ఆమె తెలిపింది.ఆ రోజుల్లో వారికి ఒకే ఒక సింక్ ఉండేదని, తను పాత్రలు కడగడానికి , నా భర్త షేవింగ్ చేసుకోవడానికి దానిని ఉపయోగించే వాళ్ళము అని తెలిపింది కేథ్రిన్ హాన్. అందుకోసం ఇద్దరమూ సరదాగా గొడవపడే వాళ్ళం అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించేది అని ఆమె చెప్పుకొచ్చింది.

ఇప్పుడు ఎంత డబ్బులు సంపాదించినా కూడా సాధారణంగా జీవించడానికి ఇద్దరము ఇష్టపడుతున్నట్టు తెలిపింది.కేవలం వారు మాత్రమే కాకుండా వారి పిల్లలకు కూడా అటువంటి పాత జీవితం గురించే చెబుతూ పెంచుతున్నట్లు తెలిపింది కేథ్రిన్ హాన్.

స్టార్డమ్ వచ్చినప్పటికీ ఇప్పటికీ మామూలు పర్సన్ లాగే ఫీల్ అవుతాను అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!
Advertisement

తాజా వార్తలు