లాక్ డౌన్ మళ్లీ పొడగించారాని ఓ మహిళ ఏకంగా...

ప్రస్తుత కాలంలో కొందరు తీసుకునే నిర్ణయాలు తమ కుటుంబాలను తీవ్ర విషాదం పాలు చేస్తున్నాయి.

తాజాగా ఓ మహిళ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ మళ్లీ పొడిగించడంతో కుటుంబం గడవదనే భయంతో ఏకంగా ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు దంపతులు తమకు పిల్లాపాపలతో నివాసం ఉంటున్నారు.అయితే ఇందులో వివాహిత భర్త కుటుంబాన్ని పోషించడం కోసం స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలో కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

Married Women Commit Suicide For Lockdown Extended Reason Married Women, Suicid

అయితే దాదాపు గత రెండు నెలలుగా పనులు లేక ఇంటి వద్దనే ఖాళీగా ఉంటున్నాడు.దీంతో ఇల్లు గడవక తనలో తానే మదన పడుతున్నాడు.

అయితే అప్పుడప్పుడు ఈ విషయం గురించి తన భార్యతో చెబుతూ ఉండేవాడు.దీనికి తోడు గతంలో కుటుంబ ఖర్చులు నిమిత్తం చేసినటువంటి అప్పుల వడ్డీలు పెరుగుతుండడంతో భార్య,భర్తలిద్దరూ ఈ విషయం గురించి బాధ పడుతూ ఉండేవారు.

Advertisement

ఆ సమయంలో వివాహిత  విచక్షణ కోల్పోయి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.అయితే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అప్పటికే ఒంటి నిండా బలంగా గాయాలు అవడంతో మరణించింది.

ఈ విషయం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కలచివేసింది.అలాగే గతంలో కూడా కొన్నిచోట్ల లాక్ డౌన్  కారణంగా పనులు నిలిచి పోవడంతో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు.

కనీసం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి లాక్ డౌన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?
Advertisement

తాజా వార్తలు