జాతకంలో మంగళ దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారకుడు లేదా కుజుడు తొమ్మిది గ్రహాలలో ఉగ్ర స్వభావుడు అని నిపుణులు చెబుతున్నారు.

భూమి, భవనం, సోదరుడు, ధైర్యం, శౌర్యం, శక్తి మొదలైన వాటికి కారకం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషం, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ గ్రహం ఎరుపు రంగులో ఉంటుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నా లేదా కుజదోషం( Kuja Dosham ) ఉందని చెప్పేవారు వారు తరచుగా బలహీనత కలిగి ఉంటారు.కుజదోషంతో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.

ఎవరి జాతకంలో కుజుడు అశుభ దృష్టి తో ఉంటే మంగళవారం చేయాల్సిన కొన్ని నివారణ చర్యలు అత్యంత పుణ్య ఫలితాలను ఇస్తాయి.

Advertisement

ఎవరి జతకంలో అంగారక దోషం ఉంటే దానిని తొలగించడానికి మంగళవారం( Tuesday ) అంగారకుడి అనుగ్రహం కోసం మంత్రాన్ని జపించాలి.ధరణీ గర్భ సంభూతం – విద్యుత్కాంతి సమప్రభం|కుమారం శక్తిహస్తం – తం మంగళం ప్రణమామ్యహం లేదా రుణ విముక్తి మంగళసూత్రాన్ని పూర్తి విశ్వాసంతో నమ్మకంతో పఠించాలి.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని రకాల మంత్రాలు( Mantras ) స్తోత్రాలను పాటించడం మాత్రమే కాకుండా స్నేహితులను, సోదరుడిని సంతోషంగా ఉంచడం ద్వారా అంగారకుడి అనుగ్రహాన్ని పొందవచ్చు.

మంగళదోషాన్ని తొలగించడానికి మంగళవారం ఉపవాసం అత్యంత ఫలవంతం.

ఈ ఉపవాస దీక్ష ఏ నెలలోనైనా శుక్లపక్షం మంగళవారం మొదలు పెట్టవచ్చు.హిందూ ధర్మం ప్రకారం 28 మంగళవారలు ఉపవాసం( Fasting ) ఉండడం వల్ల సాధకుడు ఎటువంటి కోరికైన నెరవేరుతుంది.జాతకంలో మంగళ దోషం( Mangala Dosham ) ఉండి దీనివల్ల వచ్చే అడ్డంకుల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని నివారించడానికి మంగళవారం దేవాలయ పూజారికి శక్తి మేరకు దానం చేయాలి.

హిందూ విశ్వాసం ప్రకారం జాతకంలో మంగళ దోషం ఉంటే దానిని తొలగించడానికి మంగళవారం హనుమంతుడి విగ్రహం లేదా ఫోటో ముందు దీపం వెలిగించి బజరంగ్ బాన్ పారాయణం పూర్తి భక్తి విశ్వాసంతో చేయాలి.జాతకంలో కుజుడు బలహీనంగా ఉండి జీవితంలో అన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్నట్లయితే మీరు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్25, బుధవారం 2024
Advertisement

తాజా వార్తలు