పోలీసుల అలవెన్స్ లో కోతలు విధించడం దారుణమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ అన్నారు.పోలీసులను జగన్ కక్ష సాధింపులకు వాడుకొని వదిలేశారని ఆరోపించారు.
దుర్మార్గంగా అలవెన్స్ లతో కోత విధిస్తూ జీవో నంబర్ 79 తెచ్చారన్నారు.ఈ క్రమంలో జీవో నంబర్ 79పై పోలీసు సంఘాలు నోరు విప్పాలని డిమాండ్ చేశారు.
కాగా ఏపీలో పోలీసుల అలవెన్స్ లో కోతలు షురూ అయిన సంగతి తెలిసిందే.ఈ మేరకు అలవెన్స్ లో కోత విధిస్తూ జీవో 79 విడుదల అయింది.
అయితే ఈ జీవోకు అనుకూలంగా ఉన్నట్లు ప్రభుత్వానికి డీజీపీ కార్యాలయం కన్సెంట్ ఇచ్చింది.







