మోహన్ బాబు( Mohan Babu ) కొడుకుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు విష్ణు( Hero Manchu Vishnu ) ఆయన ఇండస్ట్రీ కి వచ్చి చాలా సంవత్సరాలు అయినప్పటికీ ఆయనకి రావాల్సిన క్రేజ్ అయితే ఆయనకి రాలేదనే చెప్పాలి.తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన అడపాదడపా సినిమాలు చేస్తూ హీరోగా నెట్టుకు వస్తున్నారు.
ఇకపోతే ఇప్పటివరకు ఒక బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ కూడా ఆయన ఖాతాలో చేరలేదని చెప్పాలి.ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు మా అసోసియేషన్ ( maa association )కి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

అంతేకాదు తన తండ్రి మోహన్ బాబు స్థాపించిన మోహన్ బాబు విద్యాసంస్థలకు ప్రో ఛాన్సలర్ గా వ్యవహరిస్తున్న ఈయన అన్నింటిలో కూడా తండ్రికి తగ్గ తనయుడిగా నడుచుకుంటూ అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా మంచు విష్ణు సెలబ్రిటీ పిల్లల కోసం తీసుకున్న ఒక నిర్ణయం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యంతో పాటు ఆనందానికి గురిచేస్తోంది.అసలు విషయంలోకి వెళితే.మోహన్ బాబు విద్యాసంస్థలలో ప్రవేశం కోరుకునే సినీ ప్రముఖుల పిల్లలకు స్కాలర్షిప్ లతోపాటు ట్యూషన్ ఫీజులో రాయితీలను కూడా మంచు విష్ణు తాజాగా ప్రకటించారు.

ఇక ఈ విషయం తెలిసి సినీ సెలబ్రిటీలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు మా బిల్డింగు త్వరలోనే నిర్మిస్తామని హామీ కూడా ఇచ్చారు.ఇకపోతే బాలీవుడ్ నటీనటులకి కూడా మా అసోసియేషన్ లో సభ్యత్వం అందేలా మా పథకాలు వారికి అందేలా మంచు విష్ణు సరికొత్త ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది.తాజాగా మంచు విష్ణు తో పాటు కోశాధికారి శివ బాలాజీ( Shiva Balaji ) ముంబై బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను కలిశారు.
అక్కడ వారితో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి పథకాల అమలు విషయంపై చర్చలు నిర్వహించారు.ఇక తాజాగా బాలీవుడ్ అసోసియేషన్, మా అసోసియేషన్ ఒప్పందాలపై సంతకాలు కూడా చేయడం జరిగింది.
టాలీవుడ్ చిత్రాలలో నటించే బాలీవుడ్ నటీనటులకు అలాగే బాలీవుడ్ చిత్రాలలో నటించే టాలీవుడ్ నటీనటులకు మా అసోసియేషన్ నుంచి అలాగే బాలీవుడ్ అసోసియేషన్ నుంచి సభ్యత్వం లభిస్తుంది అని.హెల్త్ బెనిఫిట్స్ అన్ని వర్తిస్తాయని కూడా చెప్పాడు.ఇక ఈ ఇయర్ అక్టోబర్ వస్తె ఆయన మా అధ్యక్షుడిగా గెలిచి 2 ఇయర్స్ అవుతుంది అందుకే ఆర్టిస్ట్ ల కోసం ఏదైనా చేయాలి అని చాలా దృఢ సంకల్పం తో ఉన్నట్టుగా తెలుస్తుంది…
.