అమెజాన్ ప్రైమ్ లో సన్నాఫ్ ఇండియాకు వచ్చిన రెస్పాన్స్ ఇదే.. పరువు పోయిందంటూ?

ఈ ఏడాది ఫిబ్రవరి నెల 18వ తేదీన మోహన్ బాబు హీరోగా డైమండ్ రత్నబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సన్నాఫ్ ఇండియా సినిమా థియేటర్లలో విడుదలైంది.

పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకోలేదు.

ఈ మధ్య కాలంలో ఏ పెద్ద హీరో సినిమాకు సన్నాఫ్ ఇండియా సినిమా అంత దారుణంగా కలెక్షన్లు రాలేదు.మల్టీప్లెక్స్ లలో, సింగిల్ స్క్రీన్లలో ఈ సినిమాకు సంబంధించిన షోలు క్యాన్సిల్ అయ్యాయి.

ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు లక్షల్లోనే ఉన్నాయంటే ఈ సినిమా రేంజ్ ఏంటో సులభంగానే ప్రేక్షకులకు క్లారిటీ వస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

సాధారణంగా కొన్ని సినిమాలు థియేటర్లలో ఫ్లాపైనా ఓటీటీలో సూపర్ హిట్ అవుతాయి.అయితే సన్నాఫ్ ఇండియా విషయంలో అందుకు భిన్నంగా జరుగుతోంది.

Advertisement
Manchu Mohan Babu Son Of India Movie Ott Response Details Here , Amazon Prime

ఈ సినిమాకు ఓటీటీలో వస్తున్న స్పందన ఏ మాత్రం ఆశాజనకంగా లేదని తెలుస్తోంది.రొటీన్ కథ, కథనాలతో తెరకెక్కిన సన్నాఫ్ ఇండియా సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను పట్టించుకోలేదని బోగట్టా.

ఓటీటీలో కూడా ఈ సినిమా ఫ్లాప్ కావడంతో మోహన్ బాబు పరువు పోయిందని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సన్నాఫ్ ఇండియా టైటిల్ గొప్పగా ఉన్నా కంటెంట్ మాత్రం ఆకట్టుకునేలా లేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

Manchu Mohan Babu Son Of India Movie Ott Response Details Here , Amazon Prime

సన్నాఫ్ ఇండియా విషయంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకుని తర్వాత సినిమాలు ఫ్లాప్ కాకుండా మోహన్ బాబు జాగ్రత్త పడతారమో చూడాలి.మంచు ఫ్యామిలీ హీరోలు గతంతో పోలిస్తే తక్కువ సినిమాలు చేస్తున్నారు.మంచు విష్ణు, మంచు మనోజ్ పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ హీరోలు సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు