అద్భుతం, 10 నెలల క్రితం నదిలో కొట్టుకుపోయి వర్కింగ్ కండిషన్‌లో దొరికిన ఐఫోన్..

10 నెలల క్రితం నదిలో కోల్పోయిన ఫోను మళ్ళీ దొరికితే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది.

అది కూడా వర్కింగ్ కండిషన్‌లో ఉంటే అది అద్భుతమేనని చెప్పొచ్చు కదా.

తాజాగా ఇలాంటి అద్భుతం నిజంగానే జరిగింది.ఒక వ్యక్తి తన ఐఫోన్‌ని 10 నెలల క్రితం ఒక నదిలో పోగొట్టుకున్నాడు.

అయితే ఇది ఇప్పుడు దొరికింది.అది పూర్తిగా వర్కింగ్ కండిషన్ లో ఉంది.

దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.వివరాల్లోకి వెళితే.

Advertisement
Man Founds His Lost Iphone 10 Months Back In Wye River In Working Condition Deta

ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఓవైన్ డేవిస్ ఆగస్టు 2021లో ఒక బ్యాచిలర్ పార్టీలో పాల్గొన్నాడు.గ్లౌసెస్టర్‌షైర్ లోని సిండర్‌ఫోర్డ్ సమీపంలోని వై నదిలో ఈ పార్టీ జరిగింది.

అయితే పొరపాటున ఈ నదిలో డేవిస్ తన ఐఫోన్‌ను పడేశాడు.దానిని ఎంత వెతికినా అది దొరకలేదు.

చివరికి తన ఐఫోన్ పై ఆశలు వదిలేసుకుని ఇంటికి బయలుదేరాడు.సీన్ కట్ చేస్తే దాదాపు పది నెలల తర్వాత, అదే నదిపై తన కుటుంబంతో కలిసి పడవలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి ఈ ఐఫోన్ కనిపించింది.

మంచి మనసున్న ఆ వ్యక్తి ఐఫోన్‌ను తిరిగి యజమానికి ఇవ్వాలని అనుకొన్నాడు.దీని గురించి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టగా యజమాని డేవిస్ ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
డ్రోన్‌ను నమ్ముకుంటే ఇంతే సంగతులు.. పెళ్లిలో ఊహించని సీన్.. వీడియో చూస్తే నవ్వాగదు..

వెంటనే అతను సంప్రదించి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నాడు.అది కచ్చితంగా పాడైపోయి ఉంటుందని అనుకున్నాడు.

Advertisement

ఛార్జింగ్ పెట్టగానే వెంటనే ఛార్జింగ్ ఎక్కింది.

ఫోన్ కూడా స్విచ్ ఆన్ అయ్యింది.అందులోని అన్ని ఫొటోలు, వీడియోలు ఎప్పటి లాగానే ఉన్నాయి.నీళ్లలో పడక ముందు ఎలా ఉందో నీళ్ళల్లో పడి పది నెలలు అయినా కూడా అది అలానే ఉండటం చూసి డేవిస్ ఆశ్చర్యపోయాడు.

తన ప్రియమైన వారి ఫొటోలు మళ్లీ తనకు దక్కడం చూసి తాను ఎంతగానో సంతోషించాడు.సాధారణంగా ఐఫోన్స్ ip68 రేటింగ్ తో వస్తాయి.

దీని వల్ల వీటిని నీటిలో పడేసినా అందులోని పరికరాలకు ఎలాంటి డ్యామేజ్ అవ్వదు.నీటిబిందువులు ఐఫోన్ లోపలికి ప్రవేశించటం సాధ్యం కాదు.

తత్ఫలితంగా అవి పని చేస్తూనే ఉంటాయి.ఇతని గురించి తెలుసుకున్న చాలామంది ఈ ఓనర్ చాలా లక్కీ అని కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు