Mamata Mohandas : కొత్త స్పోర్ట్స్ కారును కొనుగోలు చేసిన ప్రముఖ నటి మమతా మోహన్ దాస్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

మమతా మోహన్‌దాస్‌( Mamata Mohandas ).ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా యమదొంగ.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను ముప్పుతిప్పలు పెట్టే ధనలక్ష్మిగా అందరినీ నవ్విస్తుంది.తర్వాత కృష్ణార్జున, విక్టరీ, చింతకాయల రవి, కింగ్‌, కేడి ఇలా ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

అయితే యమదొంగ( Yamadonga ) తర్వాత చాలా సినిమాలలో నటించినప్పటికీ ఆ రేంజ్ లో తగిన విధంగా గుర్తింపు మరే సినిమాతోనూ దక్కలేదని చెప్పాలి.

Mamta Mohandas Buys Bmw Z4 Sports Car Price Details

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ కన్నడ మలయాళ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించింది.వీటిలో ఎక్కువ శాతం సినిమాలు మలయాళం లోనే నటించింది మమతా మోహన్‌దాస్‌.ఇకపోతే మమతా ఆ మధ్య క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే.

Advertisement
Mamta Mohandas Buys Bmw Z4 Sports Car Price Details-Mamata Mohandas : కొత

క్యాన్సర్ ( Cancer )లాంటి ప్రాణంతక వ్యాధి బారిన పడినప్పటికీ ధైర్యంగా పోరాడి ఆ వ్యాధి నుంచి బయటపడింది.తిరిగి మళ్లీ సినిమాలపై ఫోకస్‌ పెట్టింది.హీరోయిన్‌గా, సెకండ్‌ హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించింది.

కాగా మమతా కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా ఎన్నో పాటలను పాడి సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

Mamta Mohandas Buys Bmw Z4 Sports Car Price Details

రాఖీ రాఖీ రాఖీ.నా కవ్వసాఖీ, ఆకలేస్తే అన్నం పెడతా.ఇలా అనేక పాటలు పాడింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక లగ్జరీ కారును కొనుగోలు చేసింది.బీఎమ్‌డబ్ల్యూ Z4 M40i స్పోర్ట్స్‌ కారు( BMW Z4 M40i ) ని కొనుగోలు చేసింది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా ఆ కారు ధర దాదాపుగా కోటి రూపాయలకు పైగా ఉండవచ్చని తెలుస్తోంది.

Advertisement

కొత్త కారు కొనుగోలు చేసిన సందర్భంగా అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది .

తాజా వార్తలు