ఏపీ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) అన్నారు.వైఎస్ఆర్ పాలనలో వ్యవసాయం పండగన్న షర్మిల జగన్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం దండగని విమర్శించారు.
రైతులు అంటే జగన్ కు ఎందుకు అంత చిన్నచూపని ప్రశ్నించారు.వైఎస్ఆర్( YSR ) ప్రారంభించిన ప్రాజెక్టులను జగన్ పూర్తి చేయలేదని మండిపడ్డారు.
జగన్ వైఎస్ఆర్ ఆశయాల కోసం పని చేయడం లేదని విమర్శలు చేశారు.ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడటం లేదని ఆమె ప్రశ్నించారు.ఏపీలో లిక్కర్ మాఫియా నడుస్తుందన్న షర్మిల మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదని నిలదీశారు.