ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే.. అసలు వ్యూహం ఇదేనా..?

తాజాగా ఇండియా కూటమి (India Alliance) లోని పార్టీలన్నీ ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.ఇక ఇండియా కూటమిని ఎలా అధికారంలోకి తీసుకురావాలి.

భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేయాలి అనే దానిపై చర్చించుకున్నారు.అలాగే ఇండియా కూటమికి సంబంధించి మరో 10 సమావేశాలు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి( PM Candidate ) అనగానే అందరికీ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కాంగ్రెస్ పార్టీలోని రాహుల్ గాంధీ (Rahul Gandhi) లేదా సోనియాగాంధీ అని అందరూ భావిస్తారు.కానీ అనూహ్యంగా దళిత నాయకుడు అయిన కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కార్గే పేరు పరిగణలోకి తీసుకున్నారంటూ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది.

అయితే ఈ విషయాన్ని బయటకి చెప్పకపోయినప్పటికీ ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు కర్గే నే ప్రధాని అభ్యర్థి అని లీక్ చేసినట్టు తెలుస్తోంది.అయితే ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున కార్గే పేరుని మమతా బెనర్జీ (Mamatha Banerjee) ప్రతిపాదించినట్టు సమాచారం.

Advertisement

ఇదిలా ఉంటే మల్లికార్జున కార్గేని ప్రధాని అభ్యర్థిగా ఇండియా కూటమి అనుకోవడానికి ప్రధాన కారణం ఏంటి.అసలు ఈయనను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టడం వెనుక అసలు వ్యూహం ఏంటి అని చాలామంది రాజకీయ విశ్లేషకులతో పాటు ఇతర పార్టీలు కూడా ఆలోచనలో పడ్డాయట.

అయితే ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున కార్గేని ప్రకటించడం వెనుక చాలానే కారణాలు ఉన్నాయట.ఈయన దళిత నాయకుడు.

అలాగే ఇప్పటివరకు ప్రధాని అభ్యర్థులు ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లోని వారే అవుతున్నారు.కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నవారు చాలా తక్కువ మంది.అందుకే ఈసారి దక్షిణాది నుండి ప్రధానిని చేయాలనే ఉద్దేశంతో మల్లికార్జున కార్గే పేరు ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

బిజెపి పార్టీ మోడీ (Modi) ని చూపించి బీసీ నినాదం, హిందుత్వ నినాదంతో ఓట్లు వేయించుకుంటున్నారు.కానీ ఇండియా కూటమి తమ ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున కార్గేని నిలబెట్టారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?

ఈయన ప్రధాని అయితే గనుక దేశంలో తొలి దళిత ప్రధానమంత్రి కార్గేనే అవుతారు.

Advertisement

అందుకే తొలి దళిత ప్రధానమంత్రిని( Dalit Prime Minister ) చేయడం కోసం దళితులందరూ ఒక్కటవుతారు అనే ఉద్దేశంతో కర్గేను ప్రధాని అభ్యర్థిగా అందరూ ఏకాభిప్రాయంతో నిలబెట్టినట్టు తెలుస్తోంది.అయితే కొంతమంది మాత్రం ఈయన పేరు ప్రస్తావించడం వెనుక వేరే వ్యూహం ఉందని,ఒకవేళ ఇండియా కూటమి దళిత ప్రధానిని నిలబెట్టడం వల్ల దళితుల ఓట్లతో గనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దళిత నాయకుడు అయిన మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) ని పక్కన పెడతారు అని మాట్లాడుకుంటున్నారు.మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో.

తాజా వార్తలు