అవినీతి కేసులో మాజీ ప్రధానికి 12 ఏళ్లు...!

అవినీతి అన్న పదం ఇప్పుడు ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది.పదవి చిన్నది అయినా పెద్దది అయినా కూడా దాదాపు అందరూ అవినీతికి మాత్రం పాల్పడుతూనే ఉంటున్నారు.

అలాంటి అవినీతి పరుల లిస్ట్ లో మాజీ ప్రధాని కూడా నిలిచారు.మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ కూడా అవినీతి కేసులో నేరస్థుడుగా నిరూపితమవ్వడం తో ఆయనకు 12 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

అధికార దుర్వినియోగం,మనీలాండరింగ్,నమ్మక ద్రోహం వంటి పలు నేరాలకు పాల్పడినట్లు ఆయనపై అభియోగాలు నమోదవ్వడం తో విచారణ జరిపారు అధికారులు.మలేషియా డెవలప్ మెంట్ బెర్షాద్ ఫండ్ లో అవినీతి జరిగినట్లు తేలడం తో ఆయనకు తాజాగా మంగళవారం కౌలాలంపూర్ హై కోర్టు పై మేరకు తీర్పు వెల్లడించింది.

అయితే ఇలా ఒక మాజీ ప్రధానికి శిక్షను ఖరారు చేయడం ఇదే తొలిసారి కావడం తో ఈ తీర్పు సంచలనం అయ్యింది.ఒక మాజీ ప్రధాని అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడమే కాకుండా ఈ విధంగా 12 ఏళ్లు జైలు శిక్ష ను అనుభవించనుండడం ఆ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Advertisement

మలేషియా డెవలప్‌మెంట్ బెర్హాద్‌ (1 MDB) ఫండ్‌లో అవినీతి జరుగగా,అందులో నజీర్ పాత్ర కూడా ఉన్నట్లు తేలడం తో అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్‌, నమ్మక ద్రోహానికి పాల్పడినట్లు అభియోగాలు నమోదు అయ్యాయి.దీనితో ఈ మూడు నేరాలకు గాను హైకోర్టు 12 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.

గతంలోనే ఈ కేసును విచారించిన కోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టగా తాజాగా మంగళవారం పై మేరకు తీర్పు వెల్లడించింది.అయితే ఆయనకు శిక్ష ఖరారు అయినప్పటికీ శిక్ష అమలయ్యే విషయంలో స్టే ఆర్డర్ తెచ్చుకోవడం తో ప్రస్తుతం ఆయన ఫ్రీ బర్ద్ గానే ఉన్నారు.

అంతేకాకుండా హైకోర్టు తీర్పు పై మరోసారి అప్పీల్ కు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !
Advertisement

తాజా వార్తలు