ఒక్కసారి మాల తీసేసిన తర్వాత.. ఎప్పుడు ధరించాలో తెలుసా..?

ప్రతి సంవత్సరం ఎంతో మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో, నిష్టతో వారి ఇష్టదైవానికి మాలలు ధరించి నిత్యపూజలో ఉంటారు.

ఈ విధంగా ప్రతి ఏటా ఎంతోమంది అయ్యప్ప మాలలు, శివుడి మాలలు, హనుమాన్ మాలలు, అమ్మవారి మాల ధరించి వారి సేవలో నిమగ్నమవుతారు.

ఈ మాల ధరించిన అప్పటినుంచి వాళ్లను విరమించే వరకు ఎంతో నిష్టగా ఉండాలి.కాళ్లకు చెప్పులు ధరించకుండా, మాంసాహారం తినకుండా, మన నోటి నుంచి ఎలాంటి కఠిన పదజాలం రాకుండా ఎంతో జాగ్రత్త పడుతూ నిత్యం భగవంతుని స్మరించుకుంటూ ఉంటారు.

Shiva's Necklaces, Inevitable Causes, Pooja, With Devotional Care-ఒక్క�

అయితే కొందరు మాల ధరించిన తర్వాత కొన్ని కారణాల వల్ల తొందరగా మాల విరమణ చేయాల్సి ఉంటుంది.అలాంటి వారు తిరిగి మరి ఎప్పుడు మాల ధరించాలి అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది.

అయితే ఒకసారి మాల విరమణ జరిగిన తర్వాత ఎప్పుడు ధరించాలనే విషయం గురించి ఇక్కడ తెలుసుకుందాం.మాల ధరించిన సమయంలో తల్లి లేదా తండ్రి మరణించినప్పుడు మరొక ఏడాదిపాటు వరకు మాలను ధరించకూడదు.

Advertisement

అదే విధంగా వారి భార్య మరణించిన కూడా ఒక సంవత్సరం పాటు మాల ధరించరు.ఒకవేళ వారి సంతానం, తాతలు, అవ్వలు, మేనత్త వంటివారు మరణిస్తే నెలరోజులపాటు మాలను ధరించకూడదు.

అదే విధంగా ఒకే ఇంటిపేరు కలిగి ఉండి రక్తసంబంధీకులు మరణిస్తే 13 రోజుల పాటు తిరిగి మాలను ధరించకూడదు.ఈ విధంగా ఎవరైనా చనిపోయారని తెలిసిన వెంటనే ఏదైనా ఆలయంలోనికి వెళ్లి మాల విరమణ చేయాలి.

అదేవిధంగా ఇంట్లో భార్య, కూతురు, కోడలు మొదలైన వారు గర్భం దాల్చినప్పుడు కూడా ఆ ఇంట్లో వారు మాల ధరించకూడదు.ఈ విధంగా ఒక సారి మాల ధరించిన తర్వాత ఎలాంటి అనివార్య కారణాలు జరిగినప్పుడు వెంటనే మాలను తొలగించాలి.

ఈ విధమైనటువంటి కారణాలవల్ల ఒక్కసారి మాలను తీసేస్తే, ఆ ఏడాది వరకు తిరిగి మాలను ధరించకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు