పెంగ్విన్‌ ఫ్లాప్‌తో మహేష్‌ బాబు ఫ్యాన్స్‌లో టెన్షన్‌

భారీ అంచనాల నడుమ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పెంగ్విన్‌’ చిత్రం నిరాశ పర్చింది.ఆ చిత్రంలో కీర్తి సురేష్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

కాని ఆమె లుక్‌ మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదు.ఏడు నెలల గర్బవతిగా ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ నటించింది.

కొడుకు కోసం తాపత్రయ పడే పాత్రలో కీర్తి సురేష్‌ కనిపించింది.కీర్తి సురేష్‌ ఈ చిత్రంలో డీ గ్లామర్‌ గా కనిపించి కొందరు ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.

కీర్తి సురేష్‌ అంటే మరో రకంగా ఊహించుకునే ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.పెంగ్విన్‌ చిత్రం తర్వాత కీర్తి సురేష్‌ నటించబోతున్న చిత్రం సర్కారు వారి పాట.మహేష్‌బాబుకు జోడీగా కీర్తి సురేష్‌ నటించబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా పరశురామ్‌ స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడు.

Advertisement

సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో పెంగ్విన్‌ సినిమాలో కీర్తి సురేష్‌ను అలా చూసి నిరాశ పడుతున్నారు.పెంగ్విన్‌ ఫలితం సర్కారు వారి పాట పై ఏమైనా ఉంటుందా అనే ఆందోళన వ్యక్తం అవుతుంది.

సరిలేరు నీకెవ్వరు చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మహేష్‌బాబు ఈ ఏడాది అంతా కూడా కరోనా కారణంగా గ్యాప్‌ తీసుకుని వచ్చే ఏడాది సర్కారు వారి పాట చిత్రాన్ని మొదలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చాడు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.వచ్చే ఏడాది దసరా లేదా దీపావళికి సర్కారు వారి పాట రాబోతుంది.

మహేష్‌బాబు కీర్తి సురేష్‌ మొదటి సారి కలిసి నటించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.ఇలాంటి సమయంలో పెంగ్విన్‌ సినిమా విడుదల అవ్వడంతో మహేష్‌ ఫ్యాన్స్‌లో కాస్త టెన్షన్‌ వాతావరణం కనిపిస్తుంది.

సర్కారు వారి పాట వచ్చేందుకు ఇంకా ఏడాది సమయం పడుతుందని అప్పటి వరకు పెంగ్విన్‌ గురించి అంతా మర్చి పోతారని అంటున్నారు.

ఆ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న సమంత.. అక్కడ సక్సెస్ కావడం సాధ్యమేనా?
Advertisement

తాజా వార్తలు