అందరిది ఒక దారి ... మహేష్, ఎన్టీఆర్‌ ది ఒక దారి

సూపర్ స్టార్ కృష్ణ .చాలాకాలం తరువాత ఆయన నటిస్తున్న చిత్రం "శ్రీశ్రీ".

ఇది ఒక మరాఠీ చిత్రానికి రీమేక్.మెగాస్టార్ చిరంజీవి.

Mahesh And NTR Are Not Playing The Remake Game-Mahesh And NTR Are Not Playing Th

ఆయన తదుపరి చిత్రం తమిళ చిత్రం కత్తికి రీమేక్.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .ఆయన తదుపరి చిత్రం తమిళ చిత్రం వేదాలంకి రీమేక్.మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ .ఈయన తరువాతి చిత్రం కూడా మరో తమిళ చిత్రం తని ఒరువన్ కి రిమేక్.

అక్కినేని నాగచైతన్య మళయాళ చిత్రం ప్రేమమ్ ని రీమేక్ చేస్తోంటే, నారా రోహిత్ ఒక తమిళ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు.

Advertisement

ఇలా సీనియర్, జూనియర్ తేడా లేకుండా అంతా రిమేక్ ల మీద పడ్డారు.వీళ్ళందరిది ఒక దారి అయితే మాది వేరే దారి అంటున్నారు సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్.

కేరీర్ లో ఇప్పటివరకూ రీమేక్ సినిమాలు చేయని హీరోలు వీళ్ళిద్దరే.ఇద్దరి తదుపరి సినిమాల్లో కూడా రీమేక్ ల జాడ కనబడటం లేదు.మహేష్ బ్రహ్మోత్సవం, మురుగదాస్ చిత్రాలు స్ట్రేయిట్ సినిమాలే, ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కూడా స్ట్రేయిట్ సినిమానే.

అల్రెడి హిట్ అయిన సినిమాలతో మిగితా నటులంతా సేఫ్ గేమ్ ఆడుతోంటే .వీరిద్దరు మాత్రం సొంత జడ్జిమెంటు మీద భరోసా పెట్టుకోని ముందుకువెళ్తున్నారు.

జాంబీ రెడ్డి సీక్వెల్ బడ్జెట్ అన్ని వందల కోట్లా.. ప్రశాంత్ వర్మ ప్లాన్ అలా ఉండనుందా?
Advertisement

తాజా వార్తలు