బడుగుల బతుకుల్లో వెలుగురేఖ మహాత్మ జ్యోతిబాపూలే

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 196వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షుడు కొంగరి బాలరాజు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నటువంటి కుల,మత,స్త్రీ వివక్షకు గురవుతున్న వారి అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు అని కొనియాడారు.మహాత్మా జ్యోతిరావు పూలే విద్య అందని సమాజానికి విద్యను అందించడం జరిగిందన్నారు.

పూలే దంపతులు అనగారినవర్గాల బతుకుల్లో వెలుగు నింపడానికి జీవితాలను సర్వస్వం ధారపోశారని, కాబట్టి వారి ఆశయాలను ఆచరణలో పెడితే మన బతుకుల్లో వెలుగులు నిండుతాయని అన్నారు.భారతదేశంలోనే వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ఏకైక పార్టీ బహున్ సమాజ్ పార్టీ అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండల కన్వీనర్ పోతరాజు సురేందర్,తుంగతుర్తి మండల కన్వీనర్లు కొమ్ము జయరాజ్,పోలేపాక పవన్ కల్యాణ్ ,టౌన్ కన్వీనర్ కొండగడుపుల నవీన్,దాసరి రమేష్ ,ఎర్ర మనేష్,పి.జాని,పి.

Advertisement

ధనుంజేయ్ తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
Advertisement

Latest Suryapet News