రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన గాలి సంపత్ భామ

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.

ఇందులో రవితేజకి జోడీగా మీనాక్షి చౌదరీ, డింపుల్ హయాతీ హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక రవితేజ త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో పీరియాడిక్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాని ఎనౌన్స్ చేసేశారు.అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.ఇక ఈ సినిమా కోసం హీరోయిన్స్ ని ఎంపిక చేసే పనిలో దర్శకుడు ఉన్నాడు.

Advertisement

ఈ సినిమాలో హీరోయిన్స్ గా కోలీవుడ్ నటి ఐశ్వర్య మీనన్, రోషన్ పెళ్లి సందడి సినిమాతో పరిచయం అవుతున్న శ్రీలీలని హీరోయిన్స్ గా ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తుంది.అయితే ఇప్పుడు కొత్త ఫ్రేమ్ లోకి మరో నటి కూడా వచ్చి చేరింది.

శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి అందించిన కథతో తెరకెక్కిన గాలి సంపత్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న భామ లవ్లీ సింగ్.ఈ అమ్మడుని ఇప్పుడు రవితేజ సినిమాలో మరో హీరోయిన్ గా త్రినాధ్ రావు నక్కిన ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

త్వరలో దీనికి సంబందించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.మొత్తానికి ఈ మధ్యకాలంలో రవితేజ రెగ్యులర్ హీరోయిన్స్ తో కాకుండా తన ప్రతి సినిమా ద్వారా ఓ కొత్త హీరోయిన్ ని పరిచయం చేసే పనిలో పడ్డాడని తెలుస్తుంది.

మరో వైపు నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంకా ఆరుళ్ మోహన్ ని కూడా హీరోయిన్ గా తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.మరి ప్రస్తుతం వినిపిస్తున్న నలుగురు భామలలో దర్శకుడు ఎవరిని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తాడనేది వేచి చూడాలి.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు