అప్పుడే ఆ పని మొదలుపెట్టిన మెగా కోడలు లావణ్య... తగ్గేదే లే అంటున్న నటి?

అందాల రాక్షసి (Andala Rakshasi) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి లావణ్య త్రిపాఠి(Lavanya Tripati).

మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగులో అవకాశాలను అందుకొని పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇలా పలు సినిమాలలో నటించినటువంటి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ను ప్రేమించి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.ఇప్పటికే వీరి నిచ్చితార్థం(Engagment) కూడా ఎంతో ఘనంగా జరిగింది.

త్వరలోనే ఈమె మెగా కోడలిగా మెగా ఇంట అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈమె వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకోవడానికి మెగా ఫ్యామిలీ (Mega Family) ఒక కండిషన్ పెట్టిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు పూర్తిగా దూరం కావాలి అనే కండిషన్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఆ వార్తలు అన్నీ కూడా ఆ వాస్తవమేనని ఈమె కొట్టి పారేశారు.

Advertisement

లావణ్య త్రిపాటి పులి మేక(Puli Meka) సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. జీ 5 కోసం ఈ వెబ్ సిరీస్ లో నటించిన ఈమె ఈ సిరీస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

అయితే తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar)కోసం రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం ఈమె ఓ సిరీస్ చేయబోతున్నారని ప్రస్తుతం ఈమె ఈ సిరీస్ షూటింగ్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది.షూటింగ్ లొకేషన్లో సీన్ పేపర్ చదువుతూ ఈసారి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం అంటూ ఒక క్యాప్షన్ పెట్టారు.దీంతో ఈమె నటనకు గుడ్ బై చెప్పలేదని అందరికీ అర్థమవుతుంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో లావణ్య త్రిపాటికి పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటిస్తుందని తెలిసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు