ఇక నీ పంథా మార్చకపోతే కష్టమే.. కీర్తి కెరీర్ గురించి ఫ్యాన్స్ ఆందోళన!

కీర్తి సురేష్.సహజమైన నటనతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది ఈ మహానటి.

ఈమె ఫస్ట్ సినిమాలో హిట్ కొట్టిన ఈమె నటనకు పెద్దగా పేరు రాలేదు.కానీ కీర్తి సురేష్ మహానటి సినిమా చేసిన తర్వాత మాత్రం ఈమెను తెరమీద ఎవ్వరు చూడలేదు.

మహానటి సావిత్రి గారినే ఉహించు కున్నారు.అంతలా ఈమె సత్తా చాటింది.

ఈ సినిమాతో జాతీయ పురస్కారం అందుకుని జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

Advertisement

వరుస అవకాశాలు కూడా ఈ అమ్మడిని వరించాయి.అయితే ఆ తర్వాత నుండి ఈమె ఎంచుకునే పాత్రల కారణంగా కెరీర్ గాడి తప్పింది.

ఈమె చేస్తున్న సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ అవుతూ వస్తున్నాయి.ఈమె మహానటి తర్వాత కూడా మహిళా ప్రధాన పాత్రలనే ఎంచుకుంటూ ప్లాప్ లను ఎదుర్కొంటుంది.

పెంగ్విన్, గుడ్ లక్ సఖి వంటి సినిమాలు ప్లాప్ లను మూటగట్టుకున్నాయి.అయినా కూడా ఈ అమ్మడు అదే తరహా సినిమాలను ఎంచుకుంటుంది.

ఇటీవలే చిన్ని అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.ఇందులో ఈమె రేప్ కు గురి అయినా ఒక పాపతో పాటు సర్వస్వం కోల్పోయిన ఒక అమ్మాయిగా కనిపించింది.

భారతీయుల పొదుపు మంత్రం – ప్రపంచానికే మార్గదర్శకం
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

రేప్ చేసి తన కుటుంబాన్ని కూడా నాశనం చేసిన వారిని వెతికి వెంటాడి మరీ అత్యంత దారుణంగా హత్యచేసి పాత్రలో ఈమె నటించింది.

Advertisement

అయితే ఇందులో కోర్టు సన్నివేశంలో కీర్తి సురేష్ కు రేపిస్ట్ పాత్రలో నటించిన వ్యక్తి ఈమెకు వేలు చూపించిన తీరును ఫ్యాన్స్ మర్చిపోలేక పోతున్నారు.ఈ సన్నివేశం చూసిన ఆమె ఫ్యాన్స్ ఇలాంటి పాత్రలు అవసరమా అని అభిప్రాయ పడుతున్నారు.ఈమెకు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఎందుకు ఇలాంటి పాత్రలు ఎంచుకుని నెగిటివ్ ఇంప్రెషన్ పడేలా చేసుకుంటుంది అని వాపోతున్నారు ఫ్యాన్స్.

ఇక నైనా ఈమె ఇలాంటి పాత్రలకు గుడ్ బై చెప్పి ఈమె తన పంథా మార్చుకోక పోతే కష్టమే అంటున్నారు.చూడాలి మరి ఈమె ముందు ముందు ఎలాంటి పాత్రలను ఎంచుకుంటుందో.ఇక ఈమె ఇటీవలే నటించిన సర్కారు వారి పాట హిట్ అయ్యింది.

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.అయితే ఈ సినిమా హిట్ అయినా కూడా ఈ అమ్మడికి దక్కింది ఏమీ లేదు అనే చెప్పాలి.

ప్రెసెంట్ కీర్తి చేతిలో రెండు తెలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.భోళా శంకర్ లో నటిస్తుంది.

మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు కు చెల్లెలి పాత్రలో కీర్తి నటిస్తున్నట్టు ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.అలాగే నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తుంది.

తాజా వార్తలు