శ్రావణ మాసంలోని చివరి ఏడు రోజులు.. ఏం చేస్తే మంచిదో తెలుసా..?

మన భారతదేశంలో చాలా మంది ప్రజలు ఎన్నో ఆచారాలను సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే పండగల సమయంలో ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని, ఆచరాన్ని మన దేశంలోని ప్రజలు ఎంతో చక్కగా పాటిస్తూ ఉంటారు.

అలాగే శ్రావణమాసంలో( Sravana ) చివరి వారంలోని ఏడు రోజుల్లో కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే ఎంతో మంచిది అని పెద్దవారు చెబుతూ ఉంటారు.ఆగస్టు 31 వ తేదీన శ్రావణమాసం ముగిసిపోతుంది.

అంతేకాకుండా శ్రావణ మాసంలో చివరి వారంలో ఎన్నో మంచి తిధులు, ముహూర్తాలు కూడా ఉన్నాయి.

ఈ చివరి ఏడు రోజులు ఏం కొంటే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఆగస్టు 24వ తేదీన కొన్ని వస్తువులును కొంటే రాజయోగం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు.ఏదైనా వాహనం కానీ, ప్రాపర్టీ కానీ కొనుగోలు చేయాలనుకుంటే ఆగస్టు 24న మంచి రోజు అని చెబుతున్నారు.

Advertisement

ఇంకా చెప్పాలంటే ఆగస్టు 25వ తేదీన సర్వార్ధ సిద్ధియోగం, రాజ యోగం( Sarvardha Siddhiyoga, Raja Yoga ) రెండు సిద్ధించే రోజు కాబట్టి ఏవైనా పెట్టుబడులు చేయాలనుకుంటే చేసుకోవచ్చు.ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్న బంగారం కొనుగోలు చేసిన మంచిదే అని కూడా చెబుతున్నారు.

అలాగే ఆగస్టు 26వ తేదీన రవి యోగం ( Ravi Yogam )ఉంటుంది.కాబట్టి కొత్త వాహనాలు,నగలు కొనుగోలు చేస్తే మంచిది అని చెబుతున్నారు.ఆగస్టు 29వ తేదీన రవి యోగం అమృతకాలం, విజయమూర్తాలు ఉన్నాయి.

కాబట్టి ఏం కొన్నా కూడా మంచిదే.ఏదైనా కొత్త పనులు ప్రారంభించిన శుభ ఫలితాలను పొందుతారు.

ఇంకా చెప్పాలంటే ఆగస్టు 30వ తేదీన అమృత కాలం, విజయ ముహూర్తం ఉంది.కాబట్టి వాహనాలు కొంటె మంచిదని పండితులు చెబుతున్నారు.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్2, సోమవారం 2024

అలాగే ఆగస్టు 31వ తేదీన శ్రావణ మాసం చివరి రోజున ఏ పని తలపెట్టిన అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు