కారులో రెడ్ చిల్లీలా హీట్ పుట్టిస్తున్న మంచు లక్ష్మి.. ఫోటోలు వైరల్?

మంచు లక్ష్మి ( Manchu Lakshmi ) పరిచయం అవసరం లేని పేరు ఈమె మోహన్ బాబు ( Mohan Babu ) వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ఇలా తెలుగులో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన మంచు లక్ష్మీ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయారు.

అక్కడ అవకాశాలను అందుకొని తనని తాను నిరూపించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈమె హైదరాబాద్ నుంచి ముంబై షిఫ్ట్ అయ్యారు అయితే బాలీవుడ్ అవకాశాల కోసం ఒకవైపు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఈమె భారీ స్థాయిలో రచ్చ చేస్తున్నారు.

మంచు లక్ష్మి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగే వరకు తన స్టైల్ ఒకలా ఉండేది అయితే ఎప్పుడైతే ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిందో పూర్తిగా తన వేషధారణ మొత్తం మార్చేసిందని చెప్పాలి.బాలీవుడ్ సెలబ్రిటీలకు ఏమాత్రం తీసిపోకుండా భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్నారు.తరచూ గ్లామరస్ ఫోటోషూట్లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుండేవారు.

ఇక బాలీవుడ్ వెళ్ళిన తర్వాత లక్ష్మి( Manchu Lakshmi ) మంచు ఏకంగా బికినీలో కూడా దర్శనమిచ్చారు.ఇలా రోజు రోజుకు గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ మంచు లక్ష్మి సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పాలి.అయితే తాజాగా మరోసారి ఈమె రెడ్ కలర్ డ్రెస్ ధరించి కారులో మత్తెక్కించే ఫోజులు ఇస్ ఫోటోషూట్ నిర్వహించారు.

Advertisement

ఇందుకు సంబంధించినటువంటి ఒక వీడియోని ఈమె సోషల్ మీడియా( Social media ) వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ఇక ఈ వీడియో పై నెటిజెన్స్ కామెంట్లు చేస్తూ 50 సంవత్సరాల వయసులో ఇలాంటివన్నీ అవసరమా మనకు అంటూ కామెంట్లు చేయగా మరికొందరు అక్కో జాగ్రత్త కిందపడితే అంతే సంగతులు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ ఫోటోషూట్ పై కొందరు నెటిజన్స్ అసలే వేసవి కావడంతో వేడి ఎక్కువగా ఉంది మరోసారి మీరు ఇలా హీట్ పెంచేస్తున్నారు అంటూ కూడా ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.అక్క మనది హాలీవుడ్ రేంజ్ టాలీవుడ్ కాదు అంటూ మరికొందరు స్పందిస్తున్నారు.

ఏది ఏమైనా మంచు లక్ష్మి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తున్నారని చెప్పాలి.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు