అసలు చివరి ఓవర్ లో 'సింగిల్స్' తీయాలి అనే ప్లాన్ ఎవరిదో తెలుసా.? అలాగే చేయకుంటే ఓడిపోయేవారేమో.?

ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాలి.చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి.

రెండు టీం ల పై ఒత్తిడి.

ధోని అవుట్ అయిపోయాడు, జడేజా కూడా అవుట్ అయిపోయాడు అని అభిమానుల ఆందోళన.

ఆ టైం లో కుల్దీప్, జాదవ్ కలిసి జట్టుని గెలిపించారు.బాంగ్లాదేశ్ అభిమానుల నాగిని డాన్స్ నుండి మనల్ని కాపాడారు.

ఆఖరి ఓవర్‌లో క్రీజులో ఉన్న కేదార్ జాదవ్ (23: 27 బంతుల్లో 1x4, 1x6), కుల్దీప్ యాదవ్ (5 నాటౌట్: 5 బంతుల్లో) ఎలాంటి భారీ షాట్ల జోలికి వెళ్లకుండా.ఆఖరి ఓవర్‌ అనే ఒత్తిడి ఇసుమంతైనా లేకుండా.

Advertisement

సింగిల్స్ తో ఫినిష్ చేసేసారు.మరోవైపు బంగ్లాదేశ్‌ మాత్రం తీవ్ర ఒత్తిడికి గురైంది.

ఆ జట్టు కెప్టెన్ మొర్తజా సుదీర్ఘ చర్చల తర్వాత ఆఖరి ఓవర్ బౌలింగ్‌ కోసం తొలుత సౌమ్య సర్కార్‌కి బంతినిచ్చినా.మళ్లీ చర్చలతో స్పిన్నర్ మహ్మదుల్లా చేతికి బంతి వెళ్లింది.

చివరి ఓవర్ మొదటి బంతికి స్ట్రైకింగ్ లో ఉన్న కేదార్ జాదవ్.ఓవర్ మొత్తం తనే స్ట్రైకింగ్ ఉంచుకుంటూ జట్టును గెలిపిస్తాడు అనుకున్నారు ఫాన్స్.కానీ.

అనూహ్యంగా.రెండో బంతికి తాను ఓ సింగిల్ తీసి నాన్‌స్ట్రైక్ వైపు వెళ్లిపోయాడు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

దీంతో.మళ్లీ స్ట్రైక్ కుల్దీప్‌కి వచ్చింది.

Advertisement

ఇదే అదునుగా.బంగ్లాదేశ్ టీమ్.

ఫీల్డర్లను అతని దగ్గరగా మొహరించింది.అయితే.

మూడో బంతిని ఫీల్డర్ల తలమీదుగా మిడ్ వికెట్ దిశగా బౌండరీ లైన్‌కి సమీపంలో పడేలా బంతిని కుల్దీప్ కొట్టాడు.దీంతో.

రెండు పరుగులొచ్చాయి.ఆ తర్వాత బంతి వృథా కావడంతో సమీకరణం రెండు బంతుల్లో రెండు పరుగులుగా మారిపోయింది.

ఐదో బంతికి కుల్దీప్ సింగిల్.ఆఖరి బంతికి కేదార్ ఓ సింగిల్ తీయడంతో భారత్ గెలుపు సంబరాల్లో మునిగిపోయింది.

అయితే అసలు ఈ సింగిల్స్ తీయాలి అనే ఐడియా ఎవరిదీ.? అనే డౌట్ అభిమానుల్లో నెలకొంది.ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన కేదార్ జాదవ్.

తొలి మ్యాచ్‌లోనే తీవ్ర ఉత్కంఠ మధ్య ఆఖరి ఓవర్‌లో ఆ జట్టుని గెలిపించాడు.ఆ అనుభవంతోనే కుల్దీప్ యాదవ్‌తో కలిసి అతను చాకచక్యంగా ఈ సింగిల్స్ ప్లాన్ వేశాడు.

అందులో భాగంగా తొలి మూడు బంతుల్లో వికెట్ చేజార్చుకోకుండా.ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడం, ఆ తర్వాత.

అవసరమైతే హిట్టింగ్ చేయాలని కేదార్ భావించాడు.కానీ.

ఆ అవసరం లేకపోయింది.

తాజా వార్తలు