ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి.

ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ సీఎస్ కు కీలక ఆదేశాలు జారీ చేశారు.

రేపు మహా ప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.ప్రస్తుతం కృష్ణ పార్థీవదేహాన్ని నానక్ రామ్ గూడలోని నివాసానికి తరలించారు.

ఈ నేపథ్యంలో పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.అనంతరం అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం తరువాత గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ భౌతికకాయాన్ని తరలించనున్నారు.

సాయంత్రం ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తారు.

Advertisement
2024లో టాలీవుడ్ ను ముంచేసిన డిజాస్టర్లు ఇవే.. ఈ హీరోల కెరీర్ కు కష్టమేనా?

తాజా వార్తలు