Indian Railway station: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్లు గురించి విన్నారా? మన భారత్‌లోనే వున్నాయి!

మన దేశీయ రైల్వే ఉద్యోగుల సంఖ్యలో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో మనం ఎనిమిదో స్థానంలో స్థానంలో ఉన్నామనే సంగతి అందరికీ విదితమే.అయితే రైళ్ల సంఖ్య, నిర్వహణ, సదుపాయాలు, హైస్పీడ్ మార్గాల ఏర్పాటులో మాత్రం మనం ఎప్పుడూ వెనకబడే ఉంటాము.

 Heard Of The Largest Railway Stations In The World We Are In India , Indian, L-TeluguStop.com

అయితే ప్రపంచంలోని పెద్ద రైల్వే వ్యవస్థల్ని ఒకసారి మనం చూసుకుంటే… ముందుగా అమెరికా గురించి మాట్లాడుకోవాలి.US విషయానికొస్తే దాదాపు 2,50,000 కిలోమీటర్ల మేర రైల్వేలైన్లు అక్కడ వున్నాయి.

అందుకే దీన్ని ప్రధమంగా చెప్పుకుంటారు.

అయితే అక్కడ 100% రైళ్లు సరుకు రవాణా కోసమే నడుపుతున్నారు.

ఇక ప్రయాణికుల కోసం వాడే లైన్లు కేవలం 35 వేల కి.మీ.లు మాత్రమే అని చెప్పుకోవచ్చు.అమెరికాలో రైలు ప్రయాణంపై ప్రజలు ఎక్కువగా ఆధారపడకపోవడమే దీనికి మూల కారణంగా చెప్పుకోవచ్చు.

ఆమ్‌ట్రాక్ సంస్థ 46 రాష్ట్రాల్లో 500 గమ్యస్థానాల్ని కలుపుతూ రోజుకు 300 రైళ్లు నడుపుతోంది.ఇక రెండవది చైనా.ఇక్కడ మనం చూస్తే 121,000 కి.మీ.లతో ప్రపంచంలో రెండో స్థానాన్ని ఆక్రమించింది.1945 నాటికి చైనాలో 27 వేల కిలోమీటర్లు రైల్వే లైన్లు ఉండగా ఇప్పుడది ఐదు రెట్లు పెరిగింది.

Telugu Indian, Railway, Passengers, Railways, Rare, Latest-General-Telugu

మూడవది రష్యా.ఇక్కడ గాని మనం చూసుకుంటే 86,000 కి.మి.లు.మేర రైల్వే లైన్లు కలవు.యూరప్, ఆసియా దేశాలకు రైల్వే లైన్లు ఉండడం ఈ దేశం ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.

రష్యా నుంచి ఫ్రాన్స్, జర్మనీ, ఫిన్‌లాండ్, పోలాండ్, చైనా, ఉత్తర కొరియా, మంగోలియాలకు రైల్వే లైన్లు ఉండటం ఇక్కడ మరో ప్రత్యేకత.ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాన్స్ సైబీరియన్ రైల్వే లైన్ మాస్కో నుంచి వ్లాడివోస్టక్ మధ్య ఉంది.

దూరం 9,289 కి.మి.లు.ఇక ఇండియా విషయానికొస్తే, మొత్తం రైల్వే లైన్లు 65,808 కి.మి.లు.స్వాతంత్య్రం తర్వాత కేవలం 14 వేల కిలోమీటర్లు మాత్రమే రైల్వే మార్గాల్ని విస్తరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube