Akkineni Nageswara Rao Krishna : కృష్ణ సినిమాలలోకి రావడానికి ఆ హీరోనే ఇన్స్పిరేషన్ అని తెలుసా?

నట శేఖర్ కృష్ణ తన సినీ సింహాసనం వదిలే వెళ్లిపోయారు.తెలుగు ప్రేక్షకుల మధ్యలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అల్లూరి సీతారామరాజు ఇకలేరు అనే వార్త కృష్ణ అభిమానులకు మింగుడు పడటం లేదు.

 Did You Know That Hero Is The Inspiration For Krishna To Enter Films ,krishna,an-TeluguStop.com

ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమ సగర్వంగా తలెత్తుకునేలా చేసిన నటుడు కృష్ణ నేడు ఉదయం తుది శ్వాస విడిచారు.ఇలా కృష్ణ మరణ వార్త తెలియడంతో సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు సైతం బాధతప్త హృదయాలతో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

ఈ విధంగా కృష్ణ గారిని చివరి చూపు కోసం ఎంతోమంది సెలబ్రిటీలు ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు.

ఇకపోతే ఇండస్ట్రీలో హీరోగా సుమారు 350 కి పైగా సినిమాలలో నటించిన కృష్ణ ఇండస్ట్రీలోకి రావడానికి గల కారణం ఏంటి ఎలా ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అనే విషయానికి వస్తే… కృష్ణ 1942 మే 31వ తేదీ బుర్రపాలెంలో జన్మించారు కుటుంబం వ్యవసాయ కుటుంబం.

వీరి తండ్రి కలప వ్యాపారం చేస్తూ ఉండేవారు.బాల్యమంతా సొంత గ్రామంలోని చదువు కొనసాగినప్పటికీ ఈయన ఏలూరు సి ఆర్ రెడ్డి కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు.

ఈ విధంగా ఈయన డిగ్రీ చదువుతున్న సమయంలో సి ఆర్ రెడ్డి కాలేజీకి కార్యక్రమం నిమిత్తం అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు.అక్కినేని నాగేశ్వరరావు 60 సినిమాలు చేసిన సమయంలో మొదటి సారి కృష్ణ అతనిని చూశారు.

ఒక నటుడిగా ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉండడం చూసే ఆశ్చర్యపోయిన ఈయన ఇండస్ట్రీలోకి వెళ్తే ఎంత మంది అభిమానులు ఉంటారా అని భావించి తను కూడా నటుడిగా కొనసాగాలని భావించారు.

Telugu Burrapalem, Chakrapani, Cr Reddy, Krishna, Lb Prasad, Shobhan Babu, Tolly

ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని తన తండ్రికి చెప్పి ఈయన మద్రాస్ వచ్చారు.అక్కడ ఎల్బీ ప్రసాద్, చక్రపాణి,ఎన్టీఆర్ వంటి వారిని కలవగా ఈయన సినిమాలలో నటించే వయసు లేకపోవడంతో కొద్దిరోజులు నాటకాలలో వేసి మంచి అనుభవం సంపాదించాలని చెప్పారట క్రమంలోనే ఈయన మొదటిసారి శోభన్ బాబుతో కలిసి చేసిన పాపం కాసికి అనే నాటకాన్ని వేశారు.ఇలా నాటకాలలో నటిస్తూనే నటుడు జగ్గయ్య నిర్మించిన పదండి ముందుకు పోదాం సినిమాలో చిన్న పాత్రలో నటించే అవకాశం సంపాదించుకున్నారు.

ఆ తర్వాత కుల గోత్రాలు మురళీకృష్ణ వంటి సినిమాలలో నటించినప్పటికీ తేనె మనసులు సినిమా ద్వారా ఈయన హీరోగా ఇండస్ట్రీకే పరిచయమయ్యారు.ఈ విధంగా ఈయన ఏఎన్నార్ ఇన్స్పిరేషన్ తోనే ఇండస్ట్రీ లోకి వచ్చారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube