Teachers recruitment: 26వేల టీచ‌ర్ల ఉద్యోగాల ర‌ద్దు.. హైకోర్టు సంచ‌ల‌న తీర్పు..

సోమవారం నాడు కోల్కత్తా హైకోర్టు( Kolkata High Court ) సంచలన తీర్పునిచ్చింది.ఏకంగా 26 వేల మంది ప్రభుత్వ టీచర్స్ ఉద్యోగాలను తీసేసింది.

2016 లో జరిగిన టీచర్ల రిక్రూట్మెంట్ టెస్ట్( Teachers Recruitment Test ) ను రద్దు చేస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.ఈ పరీక్ష ద్వారా జరిగిన నియామకాల్లో అవకతవకలు ఏర్పడడంతో వెంటనే వారి ఉద్యోగాలను రద్దు చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది.2016 పరీక్ష ద్వారా ఉద్యోగాలు సాధించిన టీచర్లు వారు పొందిన వేతనాలను కూడా తిరిగి ఇచ్చేయాలని న్యాయస్థానం తీర్పులో వెల్లడించింది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఏడేటి పాఠశాలలో ప్రభుత్వ ప్రయోజత పాఠశాలలో ఉపాధ్యాయులతో పాటు గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాలకు( Group C D Jobs ) సంబంధించి నియామకం కూడా 2016లో స్టేట్ లెవెల్ సెలక్షన్ కమిటీ నిర్వహించింది.ఇందులో భాగంగా 24,650 పోస్టుల కోసం పరీక్ష నిర్వహించారు.ఇందులో భాగంగా 23 లక్షల మందికి పైగా పరీక్షకు హాజరవ్వగా.

అందులో 25,753 మందిని సెలెక్ట్ చేసి అపాయింట్మెంట్ లెటర్లను( Appointment Letters ) కూడా ఇచ్చారు.అయితే కొందరు ఈ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో దానిపై విచారణ జరపాలని పిటిషన్లు దాఖలు అయ్యాయి.

Advertisement

ఇందుకు సంబంధించి హైకోర్టు ప్రత్యేక డివిజన్ బెంచ్ ను ఏర్పాటు చేసింది.

ఇక ఇన్నాళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత తాజాగా న్యాయస్థానం ఆనాటి టీచర్లను నియామక ప్రక్రియ( Teachers Recruitment )లో అవకతవకలు జరిగాయని నిర్ధారణ కావడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.ఇందుకు సంబంధించి వెంటనే కొత్త నియామక ప్రక్రియను మొదలు పెట్టాలని పశ్చిమ బెంగాల్ స్కూల్ కమిషన్ ను వెల్లడించింది.ఈ విషయం సంబంధించి మరింత పూర్తి సమగ్ర విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( CBI ) కు రాబోయే మూడు నెలల లోపల పూర్తి నివేదిక సమర్పించాలని కోర్ట్ ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు