తల్లిని తలచుకుని బిగ్ బాస్ వేదికపై ఎమోషనల్ అయిన సుదీప్.. అలా కామెంట్స్ చేస్తూ?

కిచ్చా సుదీప్ ప్రస్తుతం కన్నడ బిగ్ బాస్ సీజన్ 11 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా బిగ్ బాస్ (Bigg boss)వేదికపై ఎమోషనల్ అయ్యారు.

అసలేం జరిగిందంటే.అక్టోబర్ 19న బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తుండగా తన తల్లికి అస్వస్థతకు గురైందన్న వార్త విని సగంలోనే షోను ఆపేసి వెళ్లి పోయాడు సుదీప్(sudeep).

ఇప్పుడు ఆ బాధను దిగమింగుకుంటూ వారం రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ షోకి తిరిగి వచ్చాడు.తల్లిని కోల్పోయిన బాధలో ఉన్నా సుదీప్ మళ్లీ బిగ్ బాస్ వేదిక పైకి వచ్చాడు.

బిగ్ బాస్ వేదికపై తన తల్లికి నివాళులు అర్పించారు.

Advertisement

తాజాగా శనివారం నాటి ఎపిసోడ్‌ లో సుదీప్ హౌస్‌మేట్స్‌ తో మాట్లాడటం ప్రారంభించగానే బిగ్ బాస్ వాయిస్ వినిపించింది.షో ప్రారంభమైన రోజే నువ్వు షేర్వానీ వేసుకున్నావు, చెప్పులు లేకుండా ఉన్నావు, సరేనా అంటూ బిగ్ బాస్ స్టేజ్ ద్వారా తన తల్లితో మాట్లాడి షో స్టార్ట్ చేశాడు సుదీప్.ఇదే విషయాన్ని బిగ్ బాస్ ప్రస్తావించారు.

ఆ తర్వాత బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, గాయని, సంగీత దర్శకుడు వాసుకి వైభవ్ స్టేజ్ పైకి వచ్చి ఒక పాట పాడారు.వేదిక ముందు కూర్చున్న ప్రేక్షకులు కొవ్వొత్తులు వెలిగించి లేచి నిలబడ్డారు.

ఆ తర్వాత స్టేజిపై ఉన్న పెద్ద ఎల్‌సిడిపై సుదీప్ తల్లి పెద్ద చిత్రం కనిపించింది.బిగ్ బాస్ పోటీదారులు కూడా లేచి సుదీప్ తల్లికి నివాళులు అర్పించారు.

పాట తర్వాత వాసుకి వైభవ్ మాట్లాడుతూ.మీ అమ్మ నన్ను చాలాసార్లు ఆశీర్వదించారు.వీలైతే మీ అమ్మ గురించి కొంచెం మాట్లాడగలరా? అని అడిగాడు.దీనిపై కిచ్చా సుదీప్ స్పందిస్తూ.

పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌ నుంచి దూకిన ప్రయాణికులు.. వేరే ట్రైన్ కింద నలిగిపోయి.. ఘోర వీడియో!
వైరల్ వీడియో : ఏంటి బ్రో హీరోను పుసుక్కున అంత మాటనేశావ్..

బిగ్ బాస్ వేదికపై(bigg boss) మా అమ్మ గురించి మాట్లాడాలని అనిపించడం లేదు.కానీ బిగ్ బాస్ మా అమ్మకు చాలా ఇష్టమైన షో చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Advertisement

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా వార్తలు