తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 8( Bigg Boss Season 8 ) తెలుగు రసవత్తరంగా సాగుతోంది.చూస్తుండగానే మళ్లీ ఇంకొక వారం ముగింపు దశకు చేరుకుంది.
నేను హౌస్ లో నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళనున్నారు.గత వారం మణికంఠ హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
ఇకపోతే ఈ రోజు రాత్రికి జరిగే ఎపిసోడ్ లకు సంబంధించిన ప్రోమోలను విడుదల చేశారు.ఆ ప్రోమోలో యష్మికి ,నాగార్జున ( Yashmi, Nagarjuna )భారీగా షాక్ ఇచ్చాడు.
కాగా మణికంఠ యష్మితో క్రష్ అంటూ లవ్ ట్రాక్ నడపడం జనాలకు నచ్చలేదేమో అని రియలైజ్ అయ్యాడు.

ఆమెను కూడా అందరితో సమానంగా చూశాడు.ఈ క్రమంలో నామినేషన్స్‌లో ఆమెతో గొడవపడేటప్పుడు అక్కా అనేశాడు.అయితే అక్కా అని పిలవద్దని యష్మి తోకతొక్కిన తాచుపాములా లేచి బుసలు కొట్టింది.
కట్ చేస్తే నయనితో గొడవ జరిగినప్పుడు కూడా గౌతమ్( Gautham ) ఆమెను అక్కా అన్నాడు.దీంతో ఆమె కూడా అక్కా అనొద్దంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది.
దీని గురించి నాగ్ తాజా ప్రోమోలో చర్చించాడు.కొత్తగా రెండు బూతు పదాలు తెలిశాయి, ఒకటి అక్క, రెండోది బ్రదర్ అని నాగ్ సెటైర్లు వేశాడు.
అక్కా అంటే ప్రాబ్లం ఏంటని యష్మిని అడిగాడు.

నామినేషన్స్ లో గౌతమ్ విష్ణుతో మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలో దూరావని ప్రశ్నించాడు.మరింత క్లారిటీ కోసం వీడియో కూడా చూపించాడు.అందులో గౌతమ్ అక్కా అనగానే యష్మి తమ్ముడు అనేసింది.
సడన్ గా క్రష్ అని, సడన్ గా అక్కా అనేసరికి తీసుకోలేకపోయానని యష్మి బదులిచ్చింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







