ఖైదీనం 150 మూవీ రివ్యూ

బ్యానర్ : కొణిదెల ప్రొడక్షన్ కంపెని దర్శకత్వం : వివి వినాయక్ నిర్మాత : రామ్ చరణ్ సంగీతం : దేవిశ్రీప్రసాద్ విడుదల తేది : జనవరి 11, 2017 నటీనటులు : చిరంజీవి, కాజల్ అగర్వాల్, తరుణ్ అరోరా తదితరులు దాదాపు దశాబ్దకాలంగా తన సినీ అభిమానులకి దూరంగా ఉంటూవచ్చారు మెగాస్టార్ చిరంజీవి.ఈ గ్యాప్ లో ఏం జరిగింది అనేది అనవసరం కాని, ఇప్పటికీ తెరమీద ఆయనే నెం.

1 అనేది నగ్నసత్యం.మరి మెగాస్టార్ కంబ్యాక్ మూవీ "ఖైదీనం 150" ప్రేక్షకులని అలరిస్తుందో లేదో చూడండి.

కథలోకి వెళితే :

శీను (చిరంజీవి) జైలులో నుంచి తప్పించుకోవడంతో కథ మొదలవుతుంది.ఇతనో టిపికల్ దొంగ.

ఫారీన్ పారిపోయే సమయంలో అనుకోకుండా లక్ష్మీ (కాజల్) ని చూసి, ప్రేమలో పడి ఇక్కడే ఆగిపోతాడు.సరదాగా సాగిపోతున్న ఇతని జీవితం తనలాగే ఉన్న కొణిదెల శంకర్ (చిరంజీవి) ని చూసాక అనుకోని మలుపు తిరుగుతుంది.

Advertisement

ఈ శంకర్ ఎవరు అంటే, రైతుల భుముల్ని కాజేసి శీతల పానీయాల కంపెనీ పెట్టాలనుకునే ఓ బడా వ్యాపారవేత్త అగర్వాల్ తో (తరుణ్ అరోరా) పోరాడుతూ, రైతుల బ్రతుకుల కోసం కష్టపడుతున్న ఓ సంఘసేవకుడు.ఇద్దరివి వేరువేరు ప్రపంచాలు.

మొదట శంకర్ ని తన స్థానంలో జైలుకి పంపించి తన పేరుని వాడుకోని, కావాల్సినంత డబ్బు వెనకేసుకోవాలని అత్యశపడ్డ శీను, ఆ తరువాత శంకర్ ప్రపంచంలోకి శంకర్ గా ఎందుకు అడుగుపెట్టాడో, రైతుల ముఖాలపై చిరునవ్వు ఎలా వెలిగించాడో తెరమీద చూడాల్సిందే.

నటీనటులు నటన :

ఈ సినిమా చిరంజీవి వన్ మ్యాన్ షో.తనదైన కామెడి టైమింగ్ ఓ పాత్రలో, భావోద్వేగాన్ని కలిగించే ఎమోషన్స్ మరో పాత్రలో, చాలాబాగా పండిచారు మెగాస్టార్.ఇంటర్వల్ కి ముందు వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు, లాస్ట్ ఫైట్ కి ముందు వచ్చే సీన్లు, చిరంజీవి కేవలం ఒక స్టార్ మాత్రమే కాదు, ఓ గొప్ప నటుడు అని చెప్పడానికి సాక్ష్యాలు.

ఆయన డ్యాన్సులు మాస్ ప్రేక్షకులని ఉర్రూతలూగించటం ఖాయం.కాజల్ పాత్ర నిడివి తక్కువే.పాటల్లో అందంగా కనిపించింది.

తరుణ్ అరోరా విలన్ గా అకట్టుకోలేకపోయాడు.తన నటన ఈ చిత్రానికి మైనస్.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ పడి ఫ్లైట్ డోర్ ఊడబీకేసిన వ్యక్తి.. తర్వాతేమైందో తెలిస్తే..?

బ్రహ్మానందం, ఆలీ ఫర్వాలేదు.రాయ్ లక్ష్మి ఐటమ్ సాంగ్ మాస్ తో ఈలలు వేయించడం ఖాయం.

Advertisement

సాంకేతిక వర్గం పనితీరు :

దేవిశ్రీప్రసాద్ అందించిన పాటల్లో అమ్మడు కుమ్ముడు, రత్తాలు ఎంత పెద్ద హిట్స్ గా నిలిచాయో మనకు తెలిసిందే.చిరంజీవి ఫ్యాక్టర్ వలన అన్ని పాటలు ఎంజాయ్ చేయవచ్చు.

నేపథ్య సంగీతం బాగుంది.రత్నవేలు కెమేరా పనితనం మరోసారి, మరో చిత్రంలో ఆకట్టుకుంది.61 ఏళ్ళ చిరంజీవి తెరమీద ఇంత ఫ్రెష్ గా కనబడటంలో ఆయన పాత్ర చాలా పెద్దది.డిఐ వర్క్ కూడా కంటెంట్ మూడ్ లో ఉంది.

నిర్మాణ విలువలు అదుర్స్.ఎడింటింగ్ పరంగా కొన్ని కంప్లయింట్స్ తప్పవు.

ముఖ్యంగా అమ్మడు కుమ్ముడు హిట్ సాంగ్ అయినా, ఆ పాత్ర ప్లేస్మెంట్ అందరికి నచ్చకపోవచ్చు.

విశ్లేషణ :

తొమ్మిది ఏళ్ళ తరువాత చిరంజీవిని తెరమీద ఎలా చూడాలని ఓ అభిమాని కోరుకుంటాడో, సరిగ్గా అలాంటి చిత్రమే ఖైదీనం 150.తమిళ చిత్రం "కత్తి"కి రిమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో, తెలుగు మాస్ ప్రేక్షకులు కోసం కొన్ని మార్పులు చేసాడు వినాయక్.వినోదంపాళ్ళు ఎక్కువే జోడించారు.

అయితే, కథ కన్నా చిరంజీవి ఇమేజ్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది.చివరికి మాటలు కూడా చాలాచోట్ల చిరంజీవి పొలిటికల్ యాంగిల్ ని, ఇమేజ్ ని టచ్ చేసి రాసినట్లు ఉంటాయి.

మాటలనగానే ఓ డైలాగ్ గుర్తొచ్చింది ."గడ్డి తినాలన్నా రైతు కావాలి సార్" అనే డైలాగ్ కదిలిస్తుంది.పరుచూరి బ్రదర్స్ మాస్ డైలాగ్స్, సాయిమాధవ్ బుర్ర ఉద్వేగపూరిత మాటలు బాగా పేలాయి.

పాటలు చిరంజీవి డ్యాన్యుల కోసం ఇరికించారు.విలన్ పాత్రను పూర్తిగా లైట్ చేసేసారు.

కామెడి అవసరం ఉండదు, కాని తెలుగు మాస్ ప్రేక్షకుల కోసం తప్పదు.మొత్తం మీద మురుగదాస్ కథకి వినాయక్ టేకింగ్ ఎలా ఉంటుందని అని ఊహించుకుంటామో అలానే ఉంది.

క్లయిమాక్స్ ఫైట్ పేలలేదు.ఏదైతే ఏం, సినిమా మాత్రం హిట్.

మెగాస్టార్ విపరీతంగా అలరిస్తాడు.వినాయక్ మీద కంప్లయింట్స్ ఉన్నా, మురుగదాస్ రాసుకున్న కథలో, సన్నివేశాల్లో బలం ఉండటం, మెగాస్టార్ కంబ్యాక్ సినిమా కావడంతో, కమర్షియల్ గా భారి సక్సెస్ ని రుచి చూసే అవకాశాలే ఎక్కువ.

రేంజ్ ఎంత అనేది గౌతమీపుత్ర శాతకర్ణి టాక్ ని బట్టి ఉంటుంది.

ప్లాస్ పాయింట్స్ :

* మెగాస్టార్ * కథ, కథనం * భావోద్వేగాలు, సామాజిక అంశాలు * మాటలు

మైనస్ పాయింట్స్ :

* విలన్ పాత్ర * భిన్న అభిరుచి గల ప్రేక్షకులకి వినాయక్ టేకింగ్ నచ్చకపోవచ్చు

చివరగా :

బాస్ ఈజ్ బ్యాక్ .

తెలుగు స్టాప్ రేటింగ్ :3/5

తాజా వార్తలు