తెరుచుకున్న కేదార్‌నాథ్‌ తలుపులు.. భక్తుల సందడి ఎలా ఉందంటే..

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రెండేళ్ల తర్వాత కేదార్‌నాథ్ ధామ్ యాత్ర ప్రారంభమైంది.ఈసారి కేదార్‌నాథ్ యాత్రకు భక్తులు తరలివస్తున్నారు.

 Kedarnath Yatra 2022 Open With Heavy Crowd Kedarnath Yatra 2022 , Heavy Crowd ,-TeluguStop.com

ఈసారి భక్తుల రద్దీ గతంలోని అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.ప్రభుత్వం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ మంది భక్తులు కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకున్నారు.

ఈ సంఖ్య 25,000 దాటిందని చెబుతున్నారు.కేదార్‌నాథ్ ధామ్‌ను సందర్శించడానికి ప్రభుత్వ సూచనల ప్రకారం, కేవలం 12,000 మంది యాత్రికులకు మాత్రమే అనుమతి ఉంది.

రెండు రోజుల్లోనే దాదాపు 40 వేల మంది దర్శనానికి తరలివచ్చారు.గౌరీకుండ్ నుంచి ఆలయ ప్రాంగణం వరకు భక్తుల రద్దీ నెలకొంది.

కేదార్‌పురి పునరాభివృద్ధిలో నిర్మించిన ఆస్తా మార్గం కూడా భక్తులతో నిండిపోయింది.అయితే ఆలయ ప్రాంగణంలోని ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు అందుబాటులో లేకపోవడంతో భక్తుల్లో భయాందోళనలు నెలకొనడంతో పరిస్థితి కాస్త అదుపు తప్పింది.

భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఉత్తరాఖండ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ స్వయంగా ఆలయ ప్రవేశ ద్వారం వద్ద పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు.

కాగా భక్తుల రద్దీని నియంత్రించడానికి పరిపాలన అధికారులు తగిన ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పరిస్థితి మరీ దారుణంగా ఉండడంతో తొక్కిసలాట, లాఠీ చార్జీలు కూడా జరిగాయి.రెండేళ్ల తర్వాత కేదార్‌నాథ్ యాత్ర ప్రారంభం కావడంతో భక్తులలో ఉత్సాహం పెల్లుబుకుతోంది.అయితే పరిపాలనా లోపాల కారణంగా రాబోయే రోజులు సవాలుగా మారనున్నాయని అంటున్నారు.ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే చార్ ధామ్‌ను సందర్శించే యాత్రికుల సంఖ్యను పరిమితం చేసింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు బాబా బద్రీనాథ్‌ను రోజుకు 15 వేల మంది భక్తులు మాత్రమే దర్శించుకోగలరు.కేదార్‌నాథ్ ధామ్‌కు వచ్చే భక్తుల సంఖ్య రోజుకు 12,000గా నిర్ణయించారు.

అదే సమయంలో గంగోత్రి ధామ్‌ను ప్రతిరోజూ 7,000 మంది భక్తులు మాత్రమే సందర్శించుకునేందుు అవకాశం కల్పించారు.యమునోత్రి ధామ్‌ను సందర్శించడానికి రోజుకు 4,000 మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube