చంద్రబాబు ని దేబ్బెసిన కెసిఆర్

ఓపక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ఖర్చు మీద జోరుగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఖర్చు మీద తనకు తాను వివరణ ఇచ్చుకోవటం ఆసక్తికరంగా మారింది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ.స్వదేశీ ఖర్చుల కారణంగా అంచనాకు మించి వంద కోట్లకు పైనే ఖర్చు అయ్యిందని లెక్క తేలి విమర్శలు చుట్టుముడుతున్న వేళ.ఆ అంశంపై బాబు ఇప్పటివరకూ నోరు విప్పింది లేదు.దీనికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తాను ఇటీవల చేసిన చైనా పర్యటనకు సంబంధించిన ఖర్చును చెప్పుకొచ్చారు.

Kcr Wins Over Cbn Again-Kcr Wins Over Cbn Again-Latest News English-Telugu Tolly

ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా తాను ఇటీవల జరిపిన చైనా పర్యటన ఖర్చు గురించి కేసీఆర్ లెక్కలు చెప్పుకొచ్చారు.తన చైనా పర్యటన మీద విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని.

కానీ.తాను పెట్టిన ఖర్చు కంటే ఎక్కువ ప్రయోజనాన్ని కలిగించేలా వ్యవహరించానని చెప్పిన కేసీఆర్ ఆ లెక్కను చెప్పుకొచ్చారు.తన చైనా పర్యటన కారణం అయిన ఖర్చు రూ.2.76కోట్లు మాత్రమేనని.తన పర్యటనలో తాను 13 బిజినెస్ మీటింగ్స్ కు హాజరైనట్లు చెప్పారు.మొత్తం 17 మందితో వెళ్లిన బృందానికి విమానఖర్చులే రూ.2కోట్లు అయ్యాయని.ఆహారం.

Advertisement

బసకు మిగిలిన ఖర్చు అయ్యిందని చెప్పి.తన ఖర్చు ఎంత సింఫులోనని చెబుతూ.

ఖర్చు విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించని బాబును తెలంగాణ ముఖ్యమంత్రి దెబ్బ తీశారన్న మాట వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు