రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారేమో అంటూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం సుల్తాన్ పూర్ లో ఏర్పాటుచేసిన జహీరాబాద్, మెదక్ పార్లమెంటు నియోజకవర్గం బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో( BJP ) చేరుతారేమోనని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా కనిపించడం లేదని అన్నారు.

సర్వే రిపోర్టులు చూసి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, నారాయణపేట సభలో వణికిపోయారని సెటైర్లు వేశారు.త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో( Parliament Elections ) కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లు కంటే ఎక్కువ రావని సర్వేలో తేలిపోయిందన్నారు.

ఇటీవల అంబేద్కర్ జయంతి కూడా సరిగ్గా నిర్వహించలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Kcr Key Comments On Whether Revanth Reddy Will Join Bjp Details, Kcr, Revanth Re
Advertisement
KCR Key Comments On Whether Revanth Reddy Will Join BJP Details, KCR, Revanth Re

కనీసం అంబేద్కర్ కు నివాళులర్పించలేదు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం అంబేద్కర్ పుణ్యమా అని.తెలంగాణ రాష్ట్రం సాధించాం.ఆ మహానీయుడిని గౌరవించుకోవాలని.

గుండెల్లో పెట్టుకోవాలని 125 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు కూడా చేసుకున్నాం.పోయిన ఏడాది విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

విగ్రహ ఏర్పాటు కార్యక్రమం అంగరంగ వైభవంగా చేసాం.అటువంటి విగ్రహం పెట్టిన తర్వాత ఇటీవల వచ్చిన జయంతిని ఈ లిల్లీపుట్ గాళ్ళ ప్రభుత్వం.

కనీసం గౌరవించలేదు.అటువంటి విగ్రహానికి పువ్వు కూడా పెట్టలేదు అంజలి ఘటించలేదు.

అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
ఇంత స్లిమ్‌గా, యంగ్‌గా ఉన్న ఈ చైనీస్ మహిళ ఓ అమ్మమ్మ అట.. వయసు తెలిసి నెటిజన్లు షాక్!

అని ఆవేదన వ్యక్తం చేశారు.పైగా.

Advertisement

గేట్లు బంద్ చేసి తాళాలు వేశారు.దీన్ని కండకావరం, అజ్ఞానం, అహంకారం అనుకోవాలా.? ఎవరు పెట్టిన విగ్రహం విగ్రహమే కదా.? ఆర్టికల్ 3 తోనే తెలంగాణ వచ్చింది కాబట్టి సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం.అంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు