ఇథనాల్ పరిశ్రమ అనుమతిని రద్దు చేయాలి:కన్నెగంటి రవి

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని రావిపహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ఎన్ఎంకె ఇథనాల్పరిశ్రమ వలన రైతులకు, ప్రజలకు జరిగే దుష్ఫలితాలపై జిల్లా కేంద్రంలోని గౌతమి డిగ్రీ కళాశాలలో 16 ప్రజా సంఘాలతో ఏర్పాటు చేసిన ఎన్ఎంకె ఇథనాల్ కంపెనీ వ్యతీరేఖ పోరాట కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కన్నెగంటి రవి హాజరై మాట్లాడుతూ భారతదేశంలో నూతన పారిశ్రామిక విధానం అమలులోనికి వచ్చిన తర్వాత రసాయనిక పరిశ్రమలు గ్రామాలలోకి ప్రవేశించాయన్నారు.

ఆహార ధాన్యాలకు సంబంధించినవి పరిశ్రమలకు బదులు నేడు ప్రజలు తినే తిండితో తయారయ్యే ఇథనాల్ లాంటి పరిశ్రమలతో ఆహార కొరత ఏర్పడుతుందన్నారు.మూడు పంటలు పండే పచ్చటి పొలాల మధ్య రావి పహాడ్ లాంటి ఊర్లో కంపెనీ నిర్మిస్తే పల్లె వాతావరణన్ని కలుషితం చేస్తుందని,తద్వారా గాలి, నీరు కలుషితమై ప్రజల ప్రాణాలు తీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పొలాలకు వాడే నీటిని 1 లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి ఐదు,ఆరు లీటర్లు నీటిని వాడుతున్నారని,దీనితో పంటలకు నీరు అందదని, భూగర్భ జలం కలుషితం అవుతుందని,ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా నిర్మించే పరిశ్రమలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సదస్సుకి సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ అధ్యక్షత నిర్వహించారు.

ఈకార్యక్రమంలో చిత్తనూరు ఇథనాల్ వ్యతీరేఖ పోరాట కమిటీ కన్వినర్ బండారి లక్ష్మయ్య, ఏఐకెఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి.కోటేశ్వరరావు,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు,టిజేఎస్ రాష్ట్ర కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్,సిపిఐ జిల్లా నాయకులు దంతల రాంబాబు,ఎంసిపిఐయు రాష్ట్ర నాయకులు వరికుప్పల వెంకన్న,తెలంగాణ రైతాంగ సమితి నల్లడ మాధవ రెడ్డి, అడ్వకెట్ లింగంపల్లి భద్రయ్య,సిపియుఎస్ఐ ఆర్ఎం చామకూరి నర్సయ్య, దళిత మహాసభ రాష్ట్ర నాయకుడు వెంకట్ యాదవ్, సిపిఐ ఎంఎల్ రాంచంద్రన్ నేత బాలస్వామి,తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు తాగేళ్ల జనార్ధన్,పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు,ఎన్.ఎస్.యు.ఐ నాయకుడు సందీప్ (సర్వరం,) ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు కామల్ల నవీన్,గంట నాగయ్య, ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షకార్యదర్శిలు పోటు లక్ష్మయ్య,బొడ్డు శంకర్, ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు,సహాయ కార్యదర్శి వి.నర్సింహారావు,అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి, పి.డి.ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలేబోయిన కిరణ్,ఏఐకెఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి అలుగుబెల్లి వెంకట్ రెడ్డి, బిఓసి జిల్లా కార్యదర్శి దేసోజు మధు,పోరడ్ల దశరధ,బొల్లె వెంకన్న,ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి నజీర్,సిపిఎం జిల్లా నాయకులు పులుసు సత్యం, పి.డి.ఎస్.యు డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్, ఐఎఫ్టీయూ జిల్లా నాయకుడు సామా నర్సిరెడ్డి,సిపిఎం నాయకురాలు స్వరాజ్యం, పిఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు రామలింగమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
గృహ కార్మికులకు సమగ్ర చట్టాలు అమలు చేయాలి : జిల్లా కోఆర్డినేటర్ కాస అనసూర్య

Latest Suryapet News