బెంగుళూరులో యశ్ ఉంటున్న ఇంటి ఖరీదు ఎంతో తెలుసా?

కన్నడ ఇండస్ట్రీలో సీరియల్స్ లో నటిస్తూ అనంతరం సినిమాలలో అవకాశాలు అందుకుని చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి నటుడు యష్ (Yash) అనంతరం కేజిఎఫ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.

కే జి ఎఫ్ సినిమా ద్వారా తన నటనతో ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా చేశారు.ఈ విధంగా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి యశ్ ప్రస్తుతం బెంగళూరులోనే నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే.

తాజాగా యశ్ ఉంటున్నటువంటి ఇంటి గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈయన గత ఏడాది మొదట్లో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఎంతో విశాలవంతమైనటువంటి ఈ డూప్లెక్స్ హౌస్ బెంగళూరులోని( Bangalore ) విండ్సర్ మేనర్ సమీపంలో ఉన్న హైఎండ్ సొసైటీ - ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్‌మెంట్స్‌లో యశ్ ఇల్లు ఉంది.

అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ తో అన్ని సౌకర్యాలతో ఈ ఇల్లు చాలా సుందరంగా ఉంది.ఇక ఈ ఇంటిని చూస్తే ఇంద్రభవనాన్ని తలపించక మానదు.

Advertisement

ఇలా ఎంతో విలాసవంతమైనటువంటి ఈ ఇల్లు ఖరీదు ఎంత ఉంటుందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.అయితే ఈ ఇంటి కోసం దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటారని తెలుస్తుంది.ఏది ఏమైనా పాన్ ఇండియా స్టార్ హీరో ఇల్లు ఆ మాత్రం ఉండకపోతే ఎలా అంటూ ఈయన ఇంటి గురించి నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఇకపోతే కేజీఎఫ్ సినిమా( KGF ) తర్వాత ఇప్పటివరకు తన తదుపరి సినిమాని ప్రకటించలేదు అయితే ఈయన ఈసారి మాత్రం ఒక లేడీ డైరెక్టర్ డైరెక్షన్లో తన తదుపరి సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలను కూడా ప్రకటించబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు