సుహాసిని బర్త్ డే పార్టీలో సీనియర్ స్టార్ నటులు రచ్చ రచ్చ!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అయినటువంటి సుహాసిని మణిరత్నం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె అందం అభినయం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలలో నటించిన సుహాసిని డైరెక్టర్ మణిరత్నంను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఆగస్టు 15న సుహాసిని తన 50వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది.

ఈ క్రమంలోనే సుహాసిని బర్తడే పార్టీలో సీనియర్ నటినటులతో కలిసి ఎంతో సందడి చేశారు.సుహాసిని పుట్టినరోజు వేడుకలలో భాగంగా సీనియర్ హీరోయిన్లతో పాటు కమల్ హాసన్ కుటుంబం హాజరయ్యి సుహాసిని పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

రమ్యకృష్ణ, ఖుష్బూ, సుమలత, అంబికా, మోహన్ వంటి సీనియర్ హీరోయిన్లు ఈ పుట్టిన రోజు కార్యక్రమానికి హాజరై సరదాగా డాన్స్ లు చేస్తూ సుహాసిని పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను నటి రమ్యకృష్ణ, ఖుష్బూ, సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Senior Actors Having Fun In Suhasini Birth Day Party, Kamal Haasan, Khushbu, Su
Advertisement
Senior Actors Having Fun In Suhasini Birth Day Party, Kamal Haasan, Khushbu, Su

ఎప్పుడు వెలుగుతూ ఉండే సుహాసినితో ఎంతో విలువైన సమయాన్ని గడపానని రమ్యకృష్ణ వీడియోను షేర్ చేయగా అందుకు స్పందించిన.సుహాసిని ఐ లవ్ యు రమ్య కుట్టి అంటూ కామెంట్ చేశారు.ఇక సినిమాల విషయానికొస్తే సుహాసిని సుమంత్ హీరోగా నటిస్తున్న ఇటువంటి "మళ్ళీ మొదలైంది" చిత్రంలో ఒక వ్యాపారవేత్తగా కనిపిస్తున్నారు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు