జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిబా ఫూలే:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:వివక్షలేని సమానత్వ సమాజం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప దార్శనికుడు పూలే స్పూర్తితోనే తెలంగాణలో సుపరిపాలన అందిస్తామని,సబ్బండ వర్ణాల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని,అందులో భాగంగానే రాష్ట్ర పండుగగా ఫూలే జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.

మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబా ఫూలే 197 వ జయంతి వేడుకల్లో అయన పాల్గొని పూలే కాంస్య విగ్రహానికి,చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ భారత దేశానికి వెలుగు ప్రసాదించిన మహనీయుడు మహాత్మా జ్యోతి బా పూలే అని అన్నారు.సామాజిక దార్శనికుడుగా, సంఘసంసర్తగా,వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన క్రాంతికారుడు ఫూలే అని స్మరించుకొన్నారు.వివక్షలేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిబా ఫూలే అని కొనియాడారు.2014 కు ముందు పాలించిన పాలకులు పూలే ఆశయ సాధనకు వ్యతిరేఖంగా పాలన కొనసాగిస్తే, జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు.సబ్బండ వర్ణాల సాధికారత, సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

వెనకబడిన వర్గాల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థను ఏర్పాటుచేసి,అన్ని నియోజకవర్గాల్లో బీసీ గురుకులాలు నెలకొల్పిందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేక గురుకులాలను స్థాపించిందని,మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని చెప్పారు.బలహీనవర్గాల విద్యార్థుల విదేశీ ఉన్నత విద్యాభ్యాసానికి ఫూలే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద ఒక్కొక్కరికి రూ.20 లక్షల వరకు ఆర్థికసాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు.బహుజనుల కోసం ప్రత్యేకంగా ఆత్మగౌరవ భవనాలను నిర్మించిన కేసిఆర్ ప్రభుత్వం బీసీ వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వివరించారు.

వృత్తులవారీగా ప్రోత్సాహకాలు అందిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.బడుగు, బలహీన వర్గాల సమగ్రాభివృద్ధి కోసం పాటుపడుతూ,వారి జీవితాల్లో కేసీఆర్ వెలుగులు నింపుతున్నారన్నారు.ఫూలే ఆశయ సాధన దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ కృషి నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని పునరుద్ఘాటించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో ముందుగా జిల్లా కలెక్టర్ వెంకట్రావ్,జడ్పీ చైర్ పర్సన్ గుజ్జా దీపిక, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ మాట్లాడుతూ జ్యోతిబాపూలే స్ఫూర్తితో ప్రభుత్వం ఎన్నో పథకాలను పెట్టి బడుగు బలహీనవర్గాలను ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు.ఈరోజు మేము ఇలా ఉండటానికి కారణం ఆ మహాత్ముడి ఆశయాలేనని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్,ఎస్.మోహన్ రావ్,వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానాయ్య యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్య నారాయణ,కార్మిక నాయకులు వై.వీ,బిసి సంక్షేమ సంఘం నాయకులు సత్యనారయణ పిల్లే, చల్లమల్ల నర్సింహ,శారద దేవి,ఎం.ఆర్.పి.ఎస్ నాయకులు చినశ్రీరాములు,మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమళ్ళ హసెన్,తప్ప్పెట్ల శ్రీరాములు,స్థానిక కౌన్సిలర్ కక్కిరేని శ్రీనివాస్, పట్టణ కౌన్సిలర్లు తాహెర్ పాషా,రాజేష్,అభినయ్, జ్యోతి శ్రీ విధ్య,మున్సిపల్ కమీషనర్ రామానుజుల రెడ్డి,ఆర్డీవో రాజేంద్ర కుమార్,బీసీ సంక్షేమ అధికారి అనసూయ, డాక్టర్ రామూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News