ఎన్టీఆర్ చిన్న కొడుకు లేటెస్ట్ ఫోటోను చూశారా.. చాలా క్యూట్ గా ఉన్నాడంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు( Jr NTR ) ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉండగా వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న తారక్ ఏడాది పాటు షూటింగ్ లకు దూరంగా ఉండగా మళ్లీ వరుస షూటింగ్ లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.

తన కొడుకులకు సంబంధించిన ఫోటోలను తారక్ అరుదుగా మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేయడం జరుగుతుంది.

ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిలకు ఇద్దరు కొడుకులు కాగా పెద్ద కొడుకు పేరు అభయ్ రామ్( Abhay Ram ) చిన్న కొడుకు పేరు భార్గవ్ రామ్( Bhargav Ram ) అనే సంగతి తెలిసిందే.అభయ్ రామ్ సైలెంట్ అయితే భార్గవ్ రామ్ మాత్రం చాలా అల్లరి పిల్లాడు అని తారక్ పలు సందర్భాల్లో వెల్లడించారు.

ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సైతం మీడియాకు దూరంగా ఉంటారు.పార్టీలలో సందడి చేసినా మీడియాతో మాట్లాడటానికి మాత్రం ఆమె అస్సలు ఇష్టపడరనే సంగతి తెలిసిందే.

అయితే భార్గవ్ రామ్ లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

Advertisement

లేటెస్ట్ ఫోటోలలో భార్గవ్ రామ్ తన చేతితో వేసిన పెయింటింగ్ పట్టుకుని కనిపించారు.భార్గవ్ రామ్ లేటెస్ట్ ఫోటోలను చూసిన నెటిజన్లు భార్గవ్ చాలా క్యూట్ గా ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు.భార్గవ్ రామ్ దిష్టి తీయించుకోవాలని ఫ్యాన్స్ దిష్టి తగులుతుందని మరి కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

భార్గవ్ రామ్ వయస్సు దాదాపుగా 5 సంవత్సరాలు కావడం గమనార్హం.

భార్గవ్ రామ్, అభయ్ రామ్ తండ్రిని మించిన కొడుకులుగా సినిమా ఇండస్ట్రీలో భవిష్యత్తులో ఎదుగుతారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.భార్గవ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.భార్గవ్ రావ్ ఎంట్రీ విషయంలో ఎన్టీఆర్ ప్లాన్ ఏ విధంగా ఉందో తెలియాల్సి ఉంది.

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు