అలాంటి వ్యాధితో బాధపడుతున్న ఎన్టీఆర్.. మరింత ఆలస్యం కానున్న కొరటాల సినిమా?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకేక్కిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్.

ఈ సినిమా లో టాలీవుడ్ స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ నటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు.ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లని రాబట్టింది.దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటింది.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలు కూడ గొప్పగా చెప్పుకొచ్చాయి.

ఈ సినిమా ద్వారా రామ్ చరణ్, ఎన్టీఆర్ నేషనల్ వైడ్ హీరోలుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 అనే సినిమాలో నటించాల్సి ఉంది.

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్ సి 15 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు.ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమా రామ్ చరణ్ కి డిజాస్టర్ ని మిగిల్చింది.

Advertisement

ఈ సినిమాతో ఎన్టీఆర్ తన సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడని సమాచారం.ఎన్టీఆర్ 30 సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందని ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం తరచూ వాయిదా పడుతూ వస్తుంది.తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం.కొన్ని రోజులుగా ఎన్టీఆర్ తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం.అయితే ఇప్పటికే చాలాకాలం వాయిదా పడిన ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ జూనియర్ ఎన్టీఆర్ అనారోగ్య సమస్య కారణంగా మరి కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉంది.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

ఆగస్టు నెలలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ కి పోస్ట్ పోన్ అయ్యింది.దీంతో 2023 చివర్లో కానీ 2024 ప్రారంభంలో కానీ ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.

Advertisement

అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఇంకా సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు