'వార్ 2'లో డ్యాన్స్ వార్ జరగబోతుందా.. ఈ ఇద్దరు కలిస్తే.. నెక్స్ట్ లెవల్ అంతే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా ఫేమస్ అయిన విషయం తెలిసిందే.

మరి మన ఎన్టీఆర్ డ్యాన్స్ విషయంలో కూడా ఎక్కడ తగ్గడు.

ఇండియన్ బెస్ట్ డ్యాన్సర్స్ లోనే ఎన్టీఆర్ ఒకరు అనడంలో ఎలాంటి అతియోసోక్తి లేదు.ఎన్టీఆర్ సెట్స్ లో కూడా రిహార్సల్స్ చేయకుండానే స్టెప్స్ చూడగానే ఎంతటి కష్టమైన మూమెంట్స్ ను అయినా వెంటనే చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాడు.

మరి ట్రిపుల్ ఆర్ లో కూడా నాటు నాటు సాంగ్ లో ఏ రేంజ్ లో అదరగొట్టాడో పాన్ వరల్డ్ మొత్తం వీక్షించారు.అందుకే ఈయన సినిమాల్లో ఫ్యాన్స్ కోరుకునే ఎలిమెంట్స్ లో డ్యాన్స్ తప్పకుండ ఉంటుంది.

మరి అలాంటి స్టార్ హీరో అయినటువంటి ఎన్టీఆర్ తాజాగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే.

Advertisement

హృతిక్ రోషన్ (Hrithik Roshan) కూడా ఇండియాలో నెంబర్ వన్ డ్యాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు.ఈయన బాలీవుడ్ లోనే బెస్ట్ డ్యాన్సర్ అనే చెప్పాలి.మరి అలాంటి ఇద్దరు కలిసి ఇప్పుడు వార్ 2 (War 2 Movie) సినిమాలో భాగం కాబోతున్నారు.

దీంతో ఇరువురి స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా వీరిద్దరి నుండి డ్యాన్స్ మూమెంట్స్ ను ఖచ్చితంగా కోరుతారు.అందుకే మేకర్స్ సైతం వార్ 2 లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే కాకుండా.

డ్యాన్స్ ను కూడా ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటారని తెలుస్తుంది.

ఇదే నిజమైతే వీరు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే థియేటర్స్ దద్దరిల్లి పోవడం ఖాయం.మరి ఈ నెక్స్ట్ లెవల్ ప్రాజెక్ట్ కోసం ఇప్పటి నుండే ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ను యష్ రాజ్ ఫిలిమ్స్ పై ఆదిత్య చోప్రా నిర్మించ బోతున్నారు.

Advertisement

తాజా వార్తలు