ముచ్చటగా మూడోసారి అధ్యక్ష పదవిని దక్కించుకున్న జిన్‌పింగ్‌!

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ముచ్చటగా 3వసారి పదవిని చేపట్టేందుకు సిద్ధమయ్యాడు.

ఐదేళ్లకోసారి జరిగే CPC (చైనా కమ్యూనిస్టు పార్టీ) నేషనల్ కాంగ్రెస్ లో ప్రతినిధిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం.

కొద్దినెలల్లో ఈ జాతీయ సదస్సు జరగనుంది.నిజానికి ఈ సదస్సు ఈ ఏడాది నవంబరులో జరగాల్సి వుంది.కానీ కొవిడ్-19 సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సహా పలు జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కాస్త వాయిదా వేయాలని CPC నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.2012లో జరిగిన CPC కాంగ్రెస్ లో తొలిసారిగా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి జిన్పింగ్.పార్టీ, శక్తిమంతమైన సైనిక కమీషన్ కి నేతృత్వం వహించడంతోపాటుగా అధ్యక్ష బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.

దాని ద్వారా, అధికారం పై మంచి పట్టు సాధించారు.ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలోను, దేశంలోను సుస్థిరత నెలకొనేలా చూడటానికి పటిష్ఠ నాయకత్వం అవసరమైన నేపథ్యంలో ఆయనని మరలా ఎన్నుకోవడం జరిగింది.

పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్తో సమానంగా ఆయన ఇప్పటికే కోర్ నాయకుడిగా ఎన్నిక కావడం విశేషం.

Jinping Won The Presidency For The Third Time Jinping , China , Viral Latest, V
Advertisement
Jinping Won The Presidency For The Third Time Jinping , China , Viral Latest, V

ఇకపోతే జిన్ పింగ్ పదేళ్ల పదవీ కాలం ఈ ఏడాదితో ముగియనుంది.జిన్ పింగ్ కి మునుపు పనిచేసిన అధ్యక్షులు మావో మినహా గరిష్ఠంగా పదేళ్ల పాటు ఆ పదవిలో వున్నవారు ఇతనే కావడం విశేషం.కోర్ నాయకుడి హోదా దృష్ట్యా మరో 5 సంవత్సరాల పాటు జిన్ పింగ్ అధికారంలో కొనసాగే వీలుంది.

జీవితకాలం పాటు ఆయన పదవిలో కొనసాగుతారన్న విశ్లేషణలూ కూడా లేకపోలేదు.కాగా వీరి పదవీ కాలం పెంచడం పట్ల విమర్శలు లేకపోలేదు.కావాలనే అక్కడి ప్రభుత్వం అతనికి పట్టం కట్టినట్టుగా అక్కడి మీడియా కధనాలు అనేకం వెలువడుతున్నాయి.

మరి ఇలాంటి విమర్శలకు వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

హైదరాబాద్ చేరుకున్న మార్క్ శంకర్.. వీడియో వైరల్
Advertisement

తాజా వార్తలు