ఏఆర్‌ రెహ్మాన్‌ మేనల్లుడు మనకు బాగా తెలిసిన స్టార్..ఎంత పోరాటం చేస్తున్నాడో తెలుసా..?

జీవీ ప్రకాష్ కుమార్ అంటే పరిచయం అవసరం లేని పేరు.సంగీత దర్శకుడుగానే కాకుండా ప్లే బ్యాక్ సింగర్ గా, హీరోగా తన ప్రత్యేకత చాటుకున్నారు.

తమిళంలోనే కాకుండా తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట వంటి సినిమాలకు సంగీతం అందించి యువతను ఉర్రూతలూగించారు.రీసెంట్ గా ఆయన సంగీత సారధ్యంలో వచ్చిన "ఆకాశం నీ హద్దురా" మ్యూజికల్ హిట్ గా నిలిచింది.

సంగీత దర్శకుడిగా సత్తా చాటుతూనే, త్రిష లేదా నయనతార సినిమాతో హీరోగా మారి, పెన్సిల్, సర్వం తాళ మయం వంటి హిట్ సినిమాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్నారు.కోలీవుడ్ లోనే కాకుండా, టాలీవుడ్ లో కూడా అభిమానులను సంపాదించుకున్న జీవీకి ఈ సక్సెస్ అంత ఈజీగా రాలేదు.

పైగా ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహ్మాన్ కి స్వయాన మేనల్లుడు.అయినా గాని ఈ స్థాయికి రావడానికి జీవీ చాలానే కష్టపడ్డారట.

Advertisement

జీవీ తల్లి తనని చిన్నతనంలోనే రెహ్మాన్ దగ్గర సంగీతం నేర్పించమని పెట్టారట.రెహ్మాన్ జీవీకి సంగీతం నేర్పించి, పాటలు పాడించేవారట.

అలా జెంటిల్ మేన్ సినిమాలో "చికుబుకు చికుబుకు రైలే" సాంగ్ పాడే అవకాశం ఇచ్చారు.ఈ పాటతో జీవీ 5 ఏళ్లకే సెలబ్రిటీ అయిపోయారు.

ఆ తర్వాత దొంగ దొంగ సినిమాలో దొంగ దొంగ అనే పాట, బొంబాయి మూవీలో కుచ్చి కుచ్చి కూనమ్మా ఇలా చాలా పాటలు పాడించారు.మావయ్య నీడలో సంగీతం నేర్చుకుంటున్న జీవీకి ఊహించని షాక్ ఎదురైంది.

జీవీ తల్లి, తండ్రి విడిపోయారు.దీంతో జీవీ తండ్రితో ఉండిపోయారు.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
ఏసీపీ చెంప పగలగొట్టిన ఆశా వర్కర్.. ఎందుకంటే?

అయితే జీవీకి అప్పటివరకూ సంగీతం మీద ఆసక్తి ఉండేది కాదు.కానీ అమ్మ దూరంగా ఉందన్న బాధను మర్చిపోవడానికి సంగీతాన్ని అలవాటు చేసుకున్నారు.

Advertisement

అలా పియోనాతో పాటు కీబోర్డు పైన పట్టు సంపాదించారు.

ఒకసారి ఇంటర్ స్కూల్ పోటీలు జరుగుతుంటే కీబోర్డు ప్లేయర్ గా చోటు దక్కించుకుని విన్నర్ గా నిలిచారు.అలా ఎక్కడ పోటీలు జరిగినా వెళ్ళి విజేతగా తిరిగొచ్చేవారు.అయితే జీవీ టాలెంట్ చూసిన సంగీత దర్శకుడు భరద్వాజ్ తనతో పనిచేయమని చెప్పారట.

అప్పుడు ప్రాక్టిస్ చేయడానికి తన దగ్గర సంగీత పరికరాలు కూడా లేవట.ఆ పరికరాలని కొనడానికి జీవీ తండ్రి చాలా కష్టాలు పడ్డారట.

అప్పుడే మావయ్య రెహ్మాన్ గొప్ప సంగీత దర్శకుడిగా, జీవీ తల్లి సింగర్ గా ఎదుగుతున్నారు.ఆ సమయంలో మావయ్య సహాయం అడిగితే చేస్తారు కానీ ఎందుకో ఆ ఆలోచన రాలేదట.

అలా తన తండ్రి ఏదోలా కష్టపడి కొనిచ్చిన పరికరాలతోనే సంగీతం నేర్చుకున్నారు.భరద్వాజ్, విద్యాసాగర్, హ్యారీస్ జయరాజ్ వంటి సంగీతదర్శకుల దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ మెల్లగా అడ్వర్టైజ్మెంట్లు చేయడం స్టార్ట్ చేశారు జీవీ.

జీవీ దగ్గర సత్తా ఉందని తెలిసి ఆయన తల్లి జీవీని రెహ్మాన్ దగ్గరకు తీసుకెళ్లారట.

అయితే మేనల్లుడు కదా అని ఆయన్ని వెంటనే తీసుకోలేదట.అర్హత ఉందో లేదో పరీక్షించి అప్పుడు తన దగ్గర పనిచేసే అవకాశం ఇచ్చారట.అయితే రెహ్మాన్ దగ్గర పనిచేస్తున్నంతసేపు జీవీ చాలా భయపడేవారట.

ఎక్కడ తప్పులు చేస్తారో అని వణికిపోయేవారట.రెహ్మాన్ దగ్గర పనిచేయడం అంటే హెడ్ మాస్టర్ ముందు నిలుచుని ఉన్నట్టే ఉంటుందట జీవీకి.

ఆ భయమే, గురువు పట్ల భక్తి, అప్పటివరకూ లేని క్రమశిక్షణ ఏర్పడ్డాయట.అలా రెహ్మాన్ తో కలిసి రంగ్ దే బసంతి, స్వదేశ్ వంటి సినిమాలకి ప్రోగ్రామర్ గా పనిచేసిన జీవీ, ఆ తర్వాత మెల్లగా సంగీత దర్శకుడిగా అవకాశాలు తెచ్చుకుని ఈ స్థాయికి వచ్చారు.

ఏ.ఆర్.రెహ్మాన్ తన మావయ్య అయినా కూడా సొంత టాలెంట్ తో ఎదిగారు.దటీజ్ జీవీ ప్రకాష్ కుమార్.

తాజా వార్తలు